బీఆర్‌ఎ్‌సను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా? ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరికకు సీఎం రేవంత్ ఓకే చెప్పారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీలో కలిసి పని చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి మధ్య నోటుకు ఓటు కేసు సమయంలో విభేదాలు తలెత్తాయి. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబెల్లి టీడీపీని వీడి బీఆర్‌ఎ్‌సలో చేరి, ఐదేళ్లు మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. ఇక వరుస ఓటములతో బీఆర్ఎస్ కేడర్ నైరాశ్యంలో ఉండగా.. కీలక నేతలు తలోదారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా ఇదే అదనుగా బీఆర్‌ఎ్‌సలోని కీలక నేతలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.
ఈ నేపథ్యంలో తొలుత ఇద్దరు మంత్రులతోపాటు ఐదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి ఎర్రబెల్లిని తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపినా.. సీఎం రేవంత్ వ్యతిరేకించారని సమాచారం. ఇటీవల స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరటమే కాకుండా తన కూతురు కడియం కావ్యను వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. కడియం పార్టీని వీడటంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు పెద్ద దిక్కుగా నిలిచారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి