Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Main News రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మహిళలపై అఘాయిత్యాలు…

రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మహిళలపై అఘాయిత్యాలు…

by Rama
రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మహిళలపై అఘాయిత్యాలు...

మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మంత్రి దన్నసరి అనసూయ (సీతక్క) అన్నారు.మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ….గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ,వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను భర్తీ చేస్తామన్నారు.విద్యా శాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఇద్దరు ఎం.ఈ.ఓ లు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని దీంతో విద్యాశాఖ అద్వానంగా మారిందని ధ్వజమెత్తారు.
మహబూబాబాద్ జిల్లా లోభూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు.అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ప్రజల కు అందుబాటులో ఉండి ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఇది తొలి సమావేశం కాబట్టి అధికారులను సున్నితంగా మందలించామని రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మహిళలపై అఘాయిత్యాలు… ,త్వరలో మరోసారి సమీక్ష సమావేశం ను నిర్వహిస్తామని తెలిపారు.విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ ఎం.పి గా గెలుపొందిన పోరిక బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు డాక్టర్. మురళి నాయక్, డాక్టర్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య , ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ రాంమోహన్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
  • ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
    ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: