తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా ఇకపై రాష్ట్రంలోని వైన్ షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 -11.00 కల్లా కట్టేయాలంటూ గుప్పుమన్న కథనాలు తప్పు అని తేలిపోయింది. ఈ ప్రచారంపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి అని సోషల్ మీడియా వేదికగా సిటీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారమే దుకాణాలు, సంస్థలు ఎప్పటిమాదిరిగానే తెరచుకుంటాయని, మూసుకుంటాయని, సమయాల విషయంలో ఎలాంటి మార్పు లేదని వివరించారు. కాగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ అయ్యాయంటూ సోమవారం ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయని, నేరాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. మద్యం షాపుల క్లోజింగ్ టైమింగ్స్‌పై ఎలాంటి మార్పు లేదు ఇదంతా అసత్యమేనని పోలీసుల క్లారిటీతో తేలిపోయింది .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 199168