Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News అయోధ్య రామాలయం పైకప్పులో లీక్..

అయోధ్య రామాలయం పైకప్పులో లీక్..

by Rama
అయోధ్య రామాలయం పైకప్పులో లీక్..

అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది. అయోధ్యలో కురిసిన తొలి భారీ వర్షానికి నీళ్లు గర్భగుడిలోకి ప్రవేశించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కాగా నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మిస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు లీక్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్‌ అన్నారు. రామ్‌లల్లా ముందు పూజారి కూర్చునే చోట, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్‌ అవుతోందని పేర్కొన్నారు. నీరు ఇదే విధంగా లీకేజీ అవుతుంటే లోపల కూర్చుని పూజ చేయడం కూడా ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు.అయోధ్య రామాలయం పైకప్పులో లీక్.. నీళ్లు ఇలా ఎందుకు లీక్ అవుతున్నాయని, అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో నిర్మించిన ఆలయంలో ఇలా జరగడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: