వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే అనేలా పరిస్థితి తయారైంది. గురువారం కాలేజీలో జరిగిన సంఘటన వల్ల అయ్యో పాపం అమ్మాయిలు అనే మాటలు వినిపించాయి. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవలే రూ. 2 కోట్లతో అదనపు గదుల భవనం అందుబాటులోకి వచ్చింది. ప్రారంభం మరుసటి రోజు నుంచి కాలేజీలో కష్టాలు తిష్టవేశాయి.భవనం ప్రారంభమైన తరువాత గదులకు తాళం తీయకపోవడంతో విద్యార్థులు ఇరుకు గదులోనే చదువుకోవాల్సి వచ్చింది.ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే.. గదులు తెరుచుకున్న కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. గదులైతే ఉన్నాయి కాని అందులో కూర్చునేందుకు బేంచీలు ఏర్పాటు చేయలేదు. నేడు చేస్తారు.. రేపు చేస్తారు అనుకున్న విద్యార్థులకు నిరాశే ఎదురైంది. దీంతో గురువారం కాలేజీకి వచ్చిన అమ్మాయిలు పాత భవనంలో ఉన్న కుర్చీలను కొత్త భవనంలోకి మోసుకెళ్లారు.బరువైనా మోసుకుంటూ వెళ్లి తరగతి గదిలో వేశారు. కనీస ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను విస్మరించడం పట్ల ప్రిన్సిపల్‌తో పాటు అద్యాపక సిబ్బందిపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్దంగా కాలేజీ అమ్మాయిలతో బేంచీలను మోయించడం చర్చనీయాంశమైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో పనులు చేయించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు తమంతటా తామే బేంచీలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పినట్లు ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 91126