విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఉధ్రిక్తత పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యం చేస్తుండగా వ్యక్తి మృతిచెందాడు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గుణరామ్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు.కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ల సమ్మె. ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్లర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే మేము ఏం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సూపర్ ఇండిట్ వెంకటేశ్వరరావు ఏసీబీ భాస్కరరావు తో వైద్య విద్యార్థుల చర్చలు జరుపుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు యధాతధంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి