మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు . రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదయింది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురాజు తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ కేసులో జగన్ ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
2021 మే 14న జరిగిన ఘటనపై రఘురామరాజు ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. కస్టడీలో తనను హింసించారని… తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని తెలిపారు. ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. జగన్ ను విమర్శిస్తే చంపుతామని సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్…
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
- నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…
- సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
- అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి