అత్యంత ప్రమాదకరమైన టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న టాంకర్ బోల్తా కొట్టిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. కాకినాడ పోర్ట్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న MH04KF 0706 నంబర్ గల ట్యాంకర్ రోడ్డు పక్కన ఉన్న హై టెన్షన్ కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా కొట్టింది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం పోలీసులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న టాంకర్ బోల్తా. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పెను ప్రమాదం పొంచి ఉందని గ్రహించి మూడు అగ్నిమాపక శకటాలను సంఘటన స్థలంలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం జరిగిన నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దాపురం అగ్నిమాపకధికారి జగన్నాధ రావు తెలిపారు. అయితే జన సంచారం లేని ప్రదేశం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ట్యాంకర్ లో ఉన్న 11 టన్నుల లిక్విడ్ గాల్లో కలిసిందని ట్యాంకర్ లో ఉన్న 11 టన్నుల లిక్విడ్ ను ఎయిర్ ప్రెజర్ ద్వారా మరో ట్యాంకర్ కు డంప్ చేస్తున్నారు చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90599