ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని, ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి తగిన వైద్యం అందాలని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభాపేక్ష లేకపోయినా నాణ్యమైన వైద్యం ఎందుకు అందించలేమని అధికారులను ప్రశ్నించారు. దీనిపైన దృష్టి పెట్టి సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని చెప్పారు. దీన్ని ఒక సవాలుగా తీసుకొని యంత్రాంగం పని చేయాలన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, విశాలమైన స్థలం అన్నీ ఉన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి