Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

by Satya
తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

ప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధితుల బాధలను చూసి, కష్టాలు విని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ యుద్ధం ముగిస్తే.. ఇక రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి పెడతామన్నారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు. 9 రోజుల్లో విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చామన్నారు. సింగ్‌నగర్‌లో వరద వచ్చిన తొలి రోజు తాను పర్యటించినప్పటికీ, ఇప్పటి పరిస్థితుల్లో చాలా పురోగతి కన్పించిందన్నారు. తొలి రోజు ప్రజలు చాలా బాధగా ఉండటం చూశానని, 9వ రోజు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న పూర్తి నమ్మకం చూశానని తెలిపారు. ప్రజలు సర్వస్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: