హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా తొలుత నిర్ణయించిన 78.04 కిలోమీటర్లకు అదనంగా మరో 38.16 కిలోమీటర్లను పూర్తి చేయనుంది. దీంతో ఆరు కారిడార్లలో కలిపి మొత్తం 116.2 కిలోమీటర్లను 32,237 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన లెక్క ఖరారు చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫోర్త్‌సిటీకి కూడా మెట్రోను తీసుకెళ్లనున్నారు.
ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీవరకు 40 కిలోమీటర్ల కారిడార్‌గా 8 వేల కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే నాగోల్-ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌కు సంబంధించి డీపీఆర్‌లో స్వల్పమార్పులు చేశారు. మొదట ప్రతిపాదించిన నాగోలు, ఎల్‌బీనగర్ వయా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు- మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు-శంషాబాద్ ఎయిర్‌పోర్టు 29 కిలోమీటర్లకు బదులుగా నాగోలు నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆరాంఘర్, న్యూహైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎయిర్‌పోర్టుకు కారిడార్‌ను నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇటీవల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీపీఆర్ అంశాలను తెలియజేశారు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ..ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు విడుదల చేసారు . ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు .ఉదయం…
- హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
- నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విషాద ఘటన..నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రసవ వేదనలో ఉన్న ఓ గర్భిణి అటవీ ప్రాంతంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై ఆమెను…
- హైదరాబాద్‌లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల…
- హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె.వి. రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90153