Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home TelanganaHyderabad అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండ

అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండ

by Rama
అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండ

జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు. అల్లు అరవింద్ కు విష్ చేయగా.. విజయ్ ను అల్లు అరవింద్ అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ఫోన్ లో మాట్లాడుతున్న అల్లు అర్జున్ కాల్ ముగించి విజయ్ తో కరచాలనం చేసి హత్తుకున్నారు. విజయ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ ను కలిసేందుకు వచ్చారు. వీరితో పాటు వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్‌, రవి, దిల్‌రాజు తదితరులు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
    తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
  • సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
    సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
  • భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
    సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
  • ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
    తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్‌లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
    తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: