ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో భారీ రాయితీని ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31లోగా ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించే వారికి, వడ్డీ మొత్తంలో 50 శాతం మినహాయింపు లభిస్తుంది. ఇప్పటికే వడ్డీతో సహా పన్ను చెల్లించిన వారికి కూడా ప్రభుత్వం న్యాయం చేసింది. అటువంటి వారికి వారు పొందే రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం బిల్లులో మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ అధికారికంగా జీవో నెం.58ని విడుదల చేశారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో.. బకాయిలను వసూలు చేయడంతో పాటు పౌరులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
140
previous post





Total views : 90033