Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Latest News పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు ప్రధాని మోదీ..

పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు ప్రధాని మోదీ..

by CVR NEWS

పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా హల్దియాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బెంగాల్‌కు ఆరు గ్యారెంటీలను ప్రకటించారు మోదీ. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న భయాందోళన వాతావరణాన్ని తొలగించి, చట్టబద్ధమైన పాలనపై ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం, అధికారులు ప్రజలకు పూర్తి స్థాయిలో జవాబుదారీగా ఉంటారని గ్యారంటీ ఇచ్చారు. మమత హయాంలో జరిగిన ప్రతి కుంభకోణం, అవినీతి, మహిళలపై జరిగిన అకృత్యాలకు సంబంధించిన ఫైళ్లను మళ్లీ తెరిచి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టం నుండి తప్పించుకోలేరని, వారిని జైలుకు పంపుతామని మోదీ గ్యారంటీ ఇచ్చారు. ఇక రాజ్యాంగం కల్పించిన హక్కులను శరణార్థులందరికీ అందజేస్తామని, అదే సమయంలో దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను ఏరివేస్తామని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: