Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం..

టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం..

by CVR NEWS

తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ దంపతుల విడాకుల వ్యవహారం గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో విచారణ జరిగie..న్యాయస్థానం. ఈ కేసును జూన్‌ 15కు వాయిదా వేసింది. ఆరోజు విజయ్‌, సంగీత ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉన్న కారణంగా కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలుపగా.. కోర్టు అంగీకరించనట్లు తెలుస్తోంది. జూన్‌ 15న ఆయన కూడా హాజరుకావాలని ఆదేశించింది

మరోవైపు వీరిద్దరి విడాకుల నేపథ్యంలో సెటిల్‌మెంట్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పరస్పర విడాకులకు నామినేషన్‌లో విజయ్‌ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన రూ.250 కోట్లు సెటిల్‌మెంట్‌ ఇవ్వాలని సంగీత అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్‌మెంట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సంగీతకు మాత్రం రూ.35 కోట్లు సెటిల్‌మెంట్‌ ఇచ్చేందుకు విజయ్‌ ఆమోదించినట్లు, కుమారుడు, కుమార్తెను చూసుకుంటానని చెప్పినట్లు కోలీవుడ్‌ మీడియా పేర్కొంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: