Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

by CVR NEWS
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది. డెలివరీ కోసం వచ్చే గర్భిణీల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఒక బాలింత విషయంలో వైద్యులు చేసిన నిర్లక్ష్యం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. బషీరాబాద్ మండలం నావంగి గ్రామానికి చెందిన ఆర్తి అనే గర్భిణీ తన మొదటి కాన్పు కోసం మే 3వ తేదీన భర్త రమేష్‌తో కలిసి తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు బాబు పుట్టాడు. అయితే, మొదటి కాన్పు కావడంతో కాన్పు సమయంలో లోపల కాటన్ పెట్టేసి, అలాగే కుట్లు వేశారు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారం రోజుల తర్వాత ఆర్తి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె అత్తగారి ఇల్లు ఉన్న కర్ణాటకలోని కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లగా, అక్కడ స్థానిక వైద్యులు పరీక్షించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లోపల కాటన్ ఉంచి కుట్లు వేయడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని వారు నిర్ధారించారు. దీంతో అక్కడి వైద్యులు లోపల ఉన్న కాటన్‌ను తొలగించారు. ఇన్ఫెక్షన్ తీవ్రమై, జ్వరం విపరీతంగా రావడంతో బాధితులు మళ్లీ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ చేరిన 48 గంటలు గడిచినా పరిస్థితి అదుపులోకి రాకపోగా, జ్వరం తగ్గలేదు. దీంతో ఇక్కడి వైద్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలంటూ ఉచిత సలహా ఇచ్చి చేతులెత్తేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు ఆర్తిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014108
Total views : 79007

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.