Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

by CVR NEWS
మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం

మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్‌కు చెందిన శివాజీ రాథోడ్‌ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్‌సర్‌లోని కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఆసుపత్రి మరుగుదొడ్డిలో డిజిటల్ క్లాక్, పైపులు, వైర్లతో బాంబులా కనిపించే వస్తువును ఉంచి బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా గాలింపు చేపట్టగా… టేపు కొనుగోలుకు చేసిన డిజిటల్ చెల్లింపు ఆధారంగా నిందితుడిని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

013943
Total views : 78605

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.