Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌ఐఏ మెరుపు దాడులు..

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌ఐఏ మెరుపు దాడులు..

by CVR NEWS
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌ఐఏ మెరుపు దాడులు..

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలు, దేశ వ్యతిరేక శక్తుల నెట్‌వర్క్‌లను అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ మరోసారి ఉక్కుపాదం మోపింది. కశ్మీర్ లోయలోని శ్రీనగర్, షోపియన్ జిల్లాల్లోని మూడు అత్యంత కీలక ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలోనే ఉగ్ర లింకులు, తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనల కారణంగా యూఏపీఏ చట్టం కింద అక్రమ సంస్థగా ప్రకటించబడిన షోపియన్ జిల్లా ఇమామ్ సాహిబ్ ప్రాంతంలోని దారుల్ ఉలూమ్ సిరాజుల్ ఉలూమ్’ సంస్థలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీనితో పాటు, గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ మాజీ చీఫ్ షహ్జాదా ఔరంగజేబ్ నివాసంలోనూ ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి. అటు శ్రీనగర్‌లోని లాల్ బజార్ పరిధిలో ఉన్న బాలికల మతపర విద్యాసంస్థ ‘జామియత్ ఉల్ బనాత్’ కూడా ఈ దాడుల పరిధిలోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాల గట్టి భద్రత నడుమ జరుగుతున్న ఈ సోదాల్లో.. టెర్రర్ ఫండింగ్, కశ్మీర్‌లో అశాంతి రేపేందుకు జరుగుతున్న కుట్రలకు సంబంధించిన కీలక పత్రాలు, ఆధారాలను సేకరించడమే లక్ష్యంగా ఎన్‌ఐఏ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019576
Total views : 91152

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.