Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

by CVR NEWS
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం.. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీలను ప్రదానం చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందికి ఈ పురస్కారం దక్కగా.. వారిలో ఐదుగురు పద్మవిభూషణ్‌, 13 మంది పద్మభూషణ్‌, 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు. బాలీవుడ్ దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ను ప్రకటించగా… ఆయన తరఫున ఆయన సతీమణి, నటి హేమామాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

 

ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఈ పురస్కారాల్ని అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ వైద్యుడు జి.వెంకట్రావుకు, క్యాన్సర్‌ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ.. దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019390
Total views : 90650

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.