Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..

by CVR NEWS
సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో సైబర్‌ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్‌ పేమెంట్‌ సిస్టమ్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానంపై కొందరు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ జవాబు పత్రాలు తారుమారయ్యాయని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేయడంతో, విద్యార్థులకు స్కాన్‌ చేసిన జవాబు పత్రాల కాపీలు అందించి రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించింది బోర్డు. అయితే రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్న పోర్టల్‌పైనే సైబర్‌ దాడి జరగడంతో చెల్లింపుల్లో తీవ్ర అవకతవకలు కనిపించాయి. సాధారణంగా చెల్లించాల్సిన ఫీజుకు బదులుగా కొందరికి 68 వేల రూపాయల వరకు వేర్వేరు మొత్తాలు చూపించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సమస్య ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ పేమెంట్‌ గేట్‌వేతో అనుసంధానమైన వ్యవస్థలోనే తలెత్తినట్లు వెల్లడించారు. ఘటనపై అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు చేపట్టగా, సాంకేతిక సమస్య పరిష్కారానికి ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.మరోవైపు ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానానికి సంబంధించి మొత్తం 20 జవాబు పత్రాలు తారుమారైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంగీకరించాయి. బాధిత విద్యార్థులను సంప్రదించి సరైన జవాబు పత్రాలను అందించినట్లు తెలిపాయి.దాదాపు 98 లక్షల జవాబు పత్రాలకు సంబంధించిన 40 కోట్లకు పైగా పేజీలను స్కాన్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో సుమారు 68 వేల పత్రాల్లో నాణ్యత సమస్యలు గుర్తించడంతో వాటిని మళ్లీ స్కాన్‌ చేసినట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: