భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను భారతీయ సినీ సంగీతానికి అందించింది. లతా మంగేష్కర్‌కు సమానమైన మాధుర్యంతో ‘మరో లత’గా పేరు తెచ్చుకున్న సుమన్ కళ్యాణ్‌పూర్ మరణం సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.1937 జనవరి 28న అప్పటి అవిభక్త భారతదేశంలోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణ్‌పూర్..1950లలో సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘మంగు’, ‘శుక్రాచి చాందిని’ చిత్రాలతో గాయనిగా అరంగేట్రం చేసిన ఆమె, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో వందలాది పాటలు ఆలపించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
ఆమె స్వర మాధుర్యం దిగ్గజ గాయని లతా మంగేష్కర్ను తలపించేదిగా ఉండటంతో అభిమానులు ఆమెను ‘మరో లత’గా అభివర్ణించేవారు.
ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీతో కలిసి ఆమె దాదాపు 140 యుగళ గీతాలు ఆలపించారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రయాణంలో ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.సుమన్ కళ్యాణ్‌పూర్ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ, సంగీత ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని నివాళులర్పించారు.
ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.
47
previous post





Total views : 90730