165
మంచిర్యాల జిల్లాలో యూరియా, డీఏపీ ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతోందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 50 కేజీల యూరియా బస్తా అసలు ప్రభుత్వ ధర కేవలం రూ. 266 మాత్రమే. అయితే డీలర్లు రవాణా ఛార్జీలు అంటూ రూ. 300 వరకు వసూలు చేస్తున్నారు. మార్కెట్ లో దీని వాస్తవ ధర రూ.1743 పైగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం భారీగా రాయితీలు అందించి రైతులకు రూ. 266కే ఇస్తోంది.