Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Crime అస్సాంలోని దిబ్రూగఢ్‌లో భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్.

అస్సాంలోని దిబ్రూగఢ్‌లో భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్.

by CVR NEWS
అస్సాంలోని దిబ్రూగఢ్‌లో భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్

అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పోలీసులు భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని హరిజన్ కాలనీలో ఆకస్మిక సోదాలు చేపట్టిన అధికారులు.. డ్రగ్స్ సరఫరాకు కేంద్రంగా మారిన కోయలా పట్టి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు.వారం రోజులుగా కొనసాగుతున్న డ్రగ్స్ వ్యతిరేక చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు మొత్తం తొమ్మిది మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. సోదాల సందర్భంగా ఓ ఇంట్లో 79 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా 4 లక్షల రూపాయల 92 వేల నగదు, బంగారు ఆభరణాలను కూడా అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు డ్రగ్స్ అక్రమ రవాణాతో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, డ్రగ్స్ వ్యాపారంపై ఎలాంటి రాజీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: