వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబిన్. మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఆయన రంగారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని..రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో కార్యకర్తలు కష్టపడి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారని..తెలంగాణలోనూ కార్యకర్తలు పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే.. తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. లోక్‌సభలో 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోందని గుర్తు చేశారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని.. త్వరలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని నితిన్ నబిన్ ఆకాంక్షించారు.
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటన.
43
previous post





Total views : 180104