Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Latest News రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.

రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.

by CVR NEWS
రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన..రంగారెడ్డి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఇవాళ హైదరాబాద్‌లోని వీబీఐటీలో నిర్వహించే ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం వరంగల్‌కు వెళ్లి గిరిజన ప్రతినిధులతో సమావేశమై, ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఇక జూన్ 30న ఘట్‌కేసర్‌లో నిర్వహించే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణలో పార్టీ విస్తరణపైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు నితిన్ నబిన్. రాష్ట్ర నాయకులతో కలిసి పలు సమీక్షలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.

దేశంలో అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని..రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో కార్యకర్తలు కష్టపడి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారని..తెలంగాణలోనూ కార్యకర్తలు పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే.. తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. లోక్‌సభలో 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోందని గుర్తు చేశారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని.. త్వరలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని నితిన్ నబిన్ ఆకాంక్షించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035658
Total views : 180103

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.