Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు.

నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు.

by CVR NEWS
నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు

మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్‌లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా ఉదంతం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన రెండు నకిలీ జెమిని చాయ్ పత్తి బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నకిలీ టీ పొడిని పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సరుకును సరఫరా చేస్తున్న సదరు మహేశ్వర ట్రేడర్స్ షాపు యజమానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ ఇలాంటి ఆహార కల్తీకి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో చలామణి అవుతున్న నకిలీ వస్తువుల పట్ల వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040951
Total views : 212498

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: