Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షపాతం భారీగా తగ్గే అవకాశం-మంత్రి పొంగులేటి.

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షపాతం భారీగా తగ్గే అవకాశం-మంత్రి పొంగులేటి.

by CVR NEWS

ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అన్నారు మంత్రి పొంగులేటి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశమున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. జిల్లాల పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, అవసరమైన ఆర్థిక సహాయం, మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042266
Total views : 223654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: