మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ తీవ్రంగా అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన ప్రచండ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాల ధాటికి పూంచ్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఒక్క ఈ జిల్లాలోనే 22 మంది ప్రాణాలు కోల్పోగా, అత్యధికంగా సురన్ కోట్ ప్రాంతంలోనే వరదల ఉధృతికి 14 మంది మృతి చెందారు. కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో చిక్కుకుని నలుగురు మరణించారు. డోడాలో సంభవించిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ముమ్మరంగా సహాయక చర్యలువరదల ఉధృతికి ప్రధాన రహదారులు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత సైన్యం, స్థానిక పోలీసులు, NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి.
జమ్ముకశ్మీర్‍లో వరదలకు 29మంది మృతి.
23
previous post




Total views : 223592