Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News అస్సాంను ముంచెత్తిన భారీ వర్షాలు.

అస్సాంను ముంచెత్తిన భారీ వర్షాలు.

by CVR NEWS

అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. కుండపోత వానలు, వరదల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 16 జిల్లాల్లో 794 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఆయా జిల్లాల్లో మొత్తం 3.62 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అధికారులు 101 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నదులకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వరదనీరు జనావాసాల్లోకి వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అనేక రోడ్లు దెబ్బతిన్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042262
Total views : 223592

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: