Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు.

దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు.

by CVR NEWS

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధితులైన లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పీఎం మోదీ ఇంటిని ముట్టడించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ప్రధానమంత్రి నివాస ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంకలతో పాటు పలువురు కీలక నేతలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఈ వార్త తెలిసిన వెంటనే స్వయంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, పోలీసులతో మాట్లాడి అరెస్టయిన నాయకులందరినీ విడిపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై అణచివేత చర్యలకు పాల్పడటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు…. నీట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్ భవన్‌ల ముట్టడికి ఏఐసీసీ పిలుపునివ్వడంతో ఉద్యమం మరింత ఉధృతరూపం దాల్చింది. ఇందులో భాగంగా నేడు తెలంగాణ లోక్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని TPCC నిర్ణయించింది. ఈ నిరసన కదనరంగంలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు NSUI, యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నాయి. లోక్ భవన్ ముట్టడి పిలుపుతో హైదరాబాద్ నగరంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును .. వారి అరెస్టును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. పేపర్ లీకేజీలపై స్పష్టమైన సమాధానం చెప్పలేక, బాధ్యులపై చర్యలు తీసుకోలేక ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం వారి బలహీనతకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులంతా లోక్ భవన్ ముట్టడిని విజయవంతం చేసి, కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల నిరసన సెగ తగిలేలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042262
Total views : 223594

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: