Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.

నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.

by CVR NEWS

నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని ఆ పొదల్లో వారు పనిచేస్తుండగా ఒక్కసారిగా పెద్ద పులి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే పొదల నుంచి ఒకదాని వెంట ఒకటిగా నాలుగు పులి కూనలు బయటకు వచ్చాయి.అయితే కూనలతో పాటు ఉన్న పెద్ద పులి చూసిన కూలీలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పనులు నిలిపివేసి అక్కడి నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను కూలీలు సెల్ ఫోన్లో ఫోటోలు తీశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042262
Total views : 223594

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: