20
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ నాయకత్వ పిలుపు మేరకు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద విద్యార్థి నాయకులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు NSUI శ్రేణులు యత్నించగా, పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేశ్ అందిస్తారు.




Total views : 223618