ఏపీలో రాజకీయ క్రిమినల్స్ వ్యవహారం ఎలా ఉంటుందో చూస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని, వారు చేసే పనులు సమాజానికి హానికరమని అన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. క్రిమినల్స్ చేసిన తప్పులను ఇతరులపైకి నెట్టి వారినే బాధితులుగా చూపించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసన్నారు. 2019లో మాయమాటలతో అధికారంలోకి వచ్చి ప్రకృతి వనరులను దోచుకున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని వారిని వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్‌కు అలాంటి చరిత్ర లేదని అచ్చెన్నాయుడు అన్నారు. 2014 నుంచి 2019 వరకు బీసీలకు స్వర్ణయుగమని పేర్కొన్నారు.
జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు.
9
previous post