Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

by Rama
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు 10 గేట్లను ఎత్తి 1. 86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 4. 02 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగుతుంది. అవుట్‌ ఫ్లో 2. 50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్‌ గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215. 8 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం జలశయంలో నిల్వ 207. 41 టీఎంసీలుగా ఉంది. ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోని కుడి, ఎడమగట్లలోని జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ నుంచి మరింత వరద కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జలశయానికి చేరుకుంటున్న వరద నీటిని ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు.శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. మరో వైపు శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క డ్యామ్‌ గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులన్నీ పర్యాటకులతో సందడిగా మారిపోయాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039356
Total views : 196460

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: