Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Film ‘అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ 2024

‘అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ 2024

by Prakash
aho vikramarka

బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్(Dev Gill) అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘అహో! విక్రమార్క’ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Follow us on :FacebookInstagramYouTube & Google News

దేవ్ గిల్ ప్రొడక్షన్స్‌లో రానున్న’అహో! విక్రమార్క’ | aho vikramarka టైటిల్, ఫస్ట్ లుక్‌

‘అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ 2024(first look launch event 2024) మార్చి 8న పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌లోని డాంగే రోడ్‌లో ఎంతో ఘనంగా జరిగింది. భారీ తారాగణంతో రానున్న ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నటుడిగా మారిన నిర్మాత, మగధీర ఫేమ్ దేవ్ గిల్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము” అని పేర్కొన్నారు.

దర్శకుడు పేట త్రికోటి(Peta Trikoti) ఈ చిత్రం గురించి చెబుతూ..”‘అహో! విక్రమార్క’ ద్వారా, భాష, సంస్కృతులను, వీరత్వం, త్యాగం సారాంశాన్ని చిత్రీకరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని అన్నారు.

ఈ చిత్రంలో దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ మరియు బిత్తిరి సత్తిలతో కూడిన భారీ తారాగణం నటిస్తోంది. యాక్షన్, ప్రేమ, భావోద్వేగం వంటి అంశాలతో ఈ చిత్రం రాబోతోంది. ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు

సాంకేతిక సిబ్బంది
నిర్మాతలు : ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా.
దర్శకత్వం : పేట త్రికోటి
కథ : పెన్నేత్స ప్రసాద్ వర్మ
సంగీతం : రవి బస్రూర్ మరియు ఆర్కో ప్రవో ముఖర్జీ
కెమెరా మెన్ : కరమ్ చావ్లా గురు ప్రసాద్ ఎన్
ఎడిటర్ : తమ్మిరాజు
ప్రొడక్షన్ డిజైనర్: కార్తీక్ విధతే
స్టంట్స్: రియల్ సతీష్

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..
ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్.. నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా అంటూ రవితేజ ఎమోషనల్ …
‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.
యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్‌విసిసి & సుకుమార్ రైటింగ్స్ మైథికల్ థ్రిల్లర్ …
‘కాగితం పడవలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం.
‘కాగితం పడవలు' క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు. సినిమా కచ్చితంగా ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తుంది: ట్రైలర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: