Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh బ‌ర్డ్ ఫ్లూతో మూత‌బ‌డ్డ చికెన్ దుకాణాలు

బ‌ర్డ్ ఫ్లూతో మూత‌బ‌డ్డ చికెన్ దుకాణాలు

by Satya
Chicken shops closed due to bird flu

నెల్లూరు జిల్లాలో బ‌ర్డ్ ఫ్లూతో చికెన్ దుకాణాలు మూత‌బ‌డ్డాయి. దీంతో పేద మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు చికెన్ ముక్క అంద‌ని ద్రాక్షలా మారింది. ఇక వీరంతా బంగాళ‌దుంప‌ల‌నే చికెన్‌లాగా భావించి, లాగించేయాల్సిన ప‌రిస్థితి. ఇక ఉన్న మ‌హారాజులు మాత్రం ఆదివారం ముక్క లేనిదే ముద్ద‌దిగ‌ని వారు, మ‌ట‌న్‌, చేప‌ల‌పై ప‌డ్డారు. చికెన్ దుకాణాలు మూత‌బ‌డ‌టంతో, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌ల‌కు గిరాకీ బాగా పెరిగింది. ఇదే అదునుగా వ్యాపారులు కూడా వాటి రేట్ల‌ను పెంచేశారు. దీంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాలు వెల‌వెల‌బోతుంటే, మ‌ట‌న్‌, చేప‌ల మార్కెట్‌లు జ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. మ‌ట‌న్ కేజీ వెయ్యి రూపాయ‌ల‌కు పైగా ధ‌ర ప‌లుకుతుండ‌గా, చేప‌లు కిలో 250 రూపాయ‌ల వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతుండ‌టం గ‌మ‌నార్హం. మొత్తం మీద బ‌ర్డ్ ఫ్లూ దెబ్బ చికెన్ ల‌భించ‌ని ప‌రిస్థితితో ప్ర‌త్యామ్నాయంగా ఉండే మ‌ట‌న్ చేప‌లు రొయ్య‌లు నెల్లూరు జిల్లాలో కొండెక్కి కూర్చున్నాయి. చికెన్ దుకాణాల్లో మాత్రం కొనుగోలుదారులు లేక వెలవెలబోతుండడంతో వ్యాపారులు మాత్రం ఒక్క రోజులోనే 50 వేల రూపాయలు నష్టపోయామని వాపోతున్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..
    నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది. గూడూరు, కోట ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. రెండు రోజుల…
  • యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..
    మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించాడు. ఈ సరికొత్త డిజిటల్ ప్రయాణంపై నారా, నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఛానల్‌కు సంబంధించిన ప్రమోషనల్ టీజ‌ర్‌లో మంత్రి నారా…
  • పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సైకిల్‌పై కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014358
Total views : 80004

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.