అయోధ్య రాముడికి కానుకగా తయారుచేసిన పాదుకలను స్వయంగా అందించేందుకు కాలినడకన బయలుదేరాడో భక్తుడు.. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి పాదుకలను తలపై మోస్తూ అయోధ్యకు పాదయాత్ర మొదలుపెట్టాడు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భాగ్యనగరం సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ చార్ల శ్రీనివాస శాస్త్రి ఈ పాదయాత్ర చేపట్టారు. రాముడి కోసం ఒక్కోటీ 8 కిలోల చొప్పున వెండి పాదుకలను తయారు చేయించిన శాస్త్రి.. వాటిని తలపైన ధరించి గతేడాది అక్టోబర్ 28 న నడక ప్రారంభించారు. ఈ వెండి పాదుకలకు బంగారం అద్దాలనే తలంపుతో తన యాత్రకు మధ్యలో విరామం తీసుకున్నారు. పాదుకలను హైదరాబాద్ కు పంపించి వాటికి బంగారు పూత ఏర్పాటు చేయిస్తున్నట్లు శాస్త్రి తెలిపారు. బంగారు పూత తర్వాత ఒక్కో పాదుక బరువు 12.5 కిలోలకు చేరుతుందని, వాటి విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని వివరించారు. రాముడి పాదుకలు తిరిగి వచ్చాక మళ్లీ నడక మొదలుపెడతానని, వచ్చే వారంలో అయోధ్యకు చేరుకుంటానని శాస్త్రి చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుని రాముడి పాదుకలను ఆయన చేతిలో పెడతానని పేర్కొన్నారు. ఈ పాదుకలను అయోధ్యలోని రామ మందిరంలో భక్తుల దర్శనానికి అనుకూలంగా ఉంచుతామని సీఎం యోగి హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, శ్రీనివాస శాస్త్రి గతంలోనూ అయోధ్య రాముడికి కానుకలు అందజేశారు. రామ మందిరం నిర్మాణానికి ఒక్కోటీ 2.5 కిలోల బరువున్న 5 వెండి ఇటుకలను అయోధ్యకు పంపించారు.
East Godavari
రాజోలు దివిలో ఓఎన్జీసీ వల్ల పలు గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నా వారిని గుర్తించి.. NGD ఒక్క ప్రత్యేకమైన కమిటీ నియమించి దాని ద్వారా ఓఎన్జిసి నడ్డి విరిసి 22.76 లక్షల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు మంజూరు చేయడంతో రాజోలు దీవిలో ఉన్న పలు గ్రామాల్లో చింతలపల్లి గ్రామానికి 47లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంకు నిర్మాణం, అదే విధంగా గుడిమెళ్ళంక గ్రామానికి 8లక్షలు, కేశనపల్లి 63లక్షల రూపాయల వ్యయంతో.. అదేవిధంగా రాజోలు ఏరియా ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు 65లక్షల నిధులను మంజూరు చేసినట్లు NGD కమిటీ సభ్యుడు యనమల వెంకటపతి రాజా తెలిపారు. ఓఎన్జిసి ఈవో అమిత్ నారాయణ అన్ని విధాల కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఓఎన్జీసీ నుంచి భారీ స్థాయిలో నిధులను తెచ్చి రాజోలు ప్రాంతం మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఓఎన్జిసి చేస్తున్న సేవలను నాయకులు అవగాహన కల్పించలేకపోతున్నారని మాలాంటి వాళ్లు ఓఎన్జీసీ చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని వెంకటపతి రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో NGD మరో సభ్యులు పీకే రావు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం లో సామాజిక సాధికార బస్సు యాత్రలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మోపిదేవి వెంకటరమణ మీడియా తో మాట్లాడుతూ సామాజిక సాధికార యాత్ర కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ది అని ఆయన అన్నారు. కొన్ని సామాజిక వర్గాల వారికి సమన్వయ న్యాయం జరుగుతుందని దానికి సామాజిక సాధికార బస్సు యాత్ర నిదర్శనమని, జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అభివృద్ధిని ఈ సామాజిక సాధికార యాత్ర ద్వారా స్వాగతిస్తున్నారని, ప్రతి పేదవాడు తన కాళ్ళ మీద తాను నిలబడాలని, రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు పట్టం కడతారని ఆయన అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి లబ్ది దారుడు లబ్ది పొందారని, రేపు 2024 ఎలక్షన్స్ లో తిరిగి రెండో పర్యాయం జగన్ సీఎం అయితేనే అణగారిన వర్గాలకు, అనాగరిక వర్గాల వారికి న్యాయం జరుగుతుందని మోపిదేవి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ కొంత మంది పెట్ ఆర్టిస్టులు చెప్పే మాటలు నమ్మవద్దని 27 ఎస్సీ పధకాలు ఏమి రద్దు కాలేదని అందులో రాజోలు నియోజకవర్గంలో 939 మందికి లబ్ధి చేకురుందని, ప్రతి సంవత్సరం చేయూత ఆసరా పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు 18750/- రూపాయలు లబ్ది పొందారని, నిజమైన పేదవాడికి లబ్ది చేకూరాలని, అది జగన్ మోహన్ రెడ్డి ద్వారా సాధ్యమని, కొంత మంది ఆర్టిస్టులు ఎన్ని అబద్ధాలు చెప్పిన అవి చెల్లవని ఎమ్మెల్యే రాపాక అన్నారు. మోపిదేవి, విశ్వరూప్ మాట్లాడుతున్నటు వంటి సభా ప్రాంగణం నుండి సభ జరుగుతున్న మధ్యలో మహిళలు లెగిసి వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం అంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తుంది.
రామచంద్రపురం లో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇంచార్జి పిల్లి సూర్య ప్రకాష్ లను యానాం మాజీ ఎమ్మెల్యే, పుదుచ్చేరి అధికారిక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ టిక్కెట్ బోస్ తనయుడు పిల్లి సూర్య ప్రకాష్ కు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి జగన్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. రియల్ గా, నిజాయితీ గా ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎంపిక చేయడం సంతోషమని ఆయన అన్నారు. సర్వేలు ఆధారంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా అభ్యర్థిని ఎంపిక చేశారని ఇదే విధానాన్ని 175 నియోజకవర్గాల్లో అనుచరిస్తే పార్టీకి, ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు. బోస్ వి, నావి వ్యూహాలు ఒకేలా ఉంటాయని నీతి, నిజాయితీ గల విలువలు తో కూడిన రాజకీయాలు చేయడం వలన బోస్, నేను మంచి మిత్రులమయ్యామని అన్నారు. మేము ఇద్దరం వై ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం తో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నావాళ్ళమని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తాను పిల్లి సూర్య ప్రకాష్ కు మద్దతు గా ఎన్నికల ప్రచారం చేస్తానని, అగ్నికులక్షత్రియ కులస్తుల మద్దతు కోరుతానని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు అంతా పిల్లి సూర్య ప్రకాష్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో పిల్లి సూర్య ప్రకాష్ ను సొంత కొడుకులా భావించి ఎన్నికల ప్రచారం చేస్తానని ఆయన అన్నారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలో 11వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సమ్మె. సమ్మె లో భాగంగా ముమ్మిడివరం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిత్యావసర సరుకుల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసారు. ఆకాశం లో నిత్యావసర సరుకుల ధరలు ఉంటె అధఃపాతాళం లో మా జీతాలు ఉన్నాయి అని వారు అన్నారు. ఎం కొనం, ఎం తినం అంటూ, మా జీతాలు పెంచి మా కుటుంబాలను కాపాడాలని, పెరిగే ధరలకు హద్దే లేదు – ఏలే వాడికి బుద్ధి లేదంటూ నినాదాలు చేస్తూ నిరసన చేసారు.
కాకినాడ రేచర్ల పేట రైల్వే ట్రాక్ సమీపంలో ఐరన్ స్క్రాప్ దుకాణంలో వైర్ల నుండి కాపర్ తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. అది గమనించిన అక్కడున్న స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ కు, అగ్నిమాపక సిబ్బందికు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న స్థానిక యువత మరియు పోలీస్ సిబ్బంది వారి సహాయంతో మూడు ఫైర్ ఇంజన్ వాటర్ ఉపయోగించినా కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది. నివాసాలు ఉంటున్న ఇళ్ల మధ్యలో ఇటువంటి స్క్రాబ్ దుకాణాలు పెట్టి వారు వ్యాపార లావాదేవీల కోసం వైర్లు కాల్చడం వల్లే ఇటువంటి ఘటనకు పాల్పడ్డాయని అక్కడున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దుకాణాలు నివాసాల మధ్యలో పెట్టి మా ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఇప్పటికైనా అధికారులు ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అక్కడున్న స్థానికలు కోరుతున్నారు.
అంగన్వాడీలు 24 రోజులుగా చేస్తున్న సమ్మె లో వరుస వినూత్న నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం పిల్లలకు గాంధీ, అంభేద్కర్ వేషధారణ వేయించి వినూత్నంగా నిరసన తెలియచేసారు. జగన్ మోహన్ రెడ్డి తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరారు. తమ హామీలు నెరవేర్చే వరకూ అదరం, బెదరం అంటూహరి దాసు వేషధారణలో కీర్తనలు పాడుతూ నిరసన తెలిపారు.
సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానాం విచ్చేసిన కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ సహాయమంత్రి ఎల్.మురుగన్ బృందం యానాంలో పర్యటించారు. వారికి యానాంలో ఘన స్వాగతం లభించింది. యానాం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద వారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సావిత్రి నగర్ ఫిషింగ్ హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నాయకులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఒ.ఎన్.జి.సి నష్టపరిహారం, డీజిల్ సబ్సిడీ, ఆక్వారంగానికి విద్యుత్ సబ్సిడీ, మూసుకుపోయిన మొగలో ఇసుకమేటలను తొలగించాలని మత్స్యకార నాయకులు మంత్రిని కోరారు. సమస్యలను విన్న కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. యానాం మత్స్యకారుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా మాట్లాడుతూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సాగర పరిక్రమ యాత్రలో భాగంగా మత్సకారుల సమస్యలను పరిష్కరించేందుకు ఏడు వేల కిలోమీటర్ల పర్యటించానని అన్నారు. మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. మత్సకారుల జీవన ప్రమాణం పెరగాలని, ఆర్దికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పలు పధకాలను ప్రవేశపెట్టిందని, ఆ పథకాలు గ్రామ స్దాయిలో ఉండే ప్రతీ ఒక్కరికి అందచేసేందుకు సాగర పరిక్రమ యాత్ర చేపట్టినట్లుగా తెలియజేసారు. స్దానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మాట్లాడుతూ.. యానాం మత్సకారులకు ఓ.ఎన్.జి.సి పరిహారం అందజేయడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అంటూ, దానికి కారణం నాలుగు రోజులలో అందరిముందు బయటపెడతానని సభాముఖంగా తెలియజేసారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసిపి ఇన్చార్జిగా ఉమ్మడి రాష్ట్రాల మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం నియమితులయ్యారు. వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విడుదల చేసిన ఇన్చార్జిల లిస్టులో నరసింహం పేరును ప్రకటించారు. దీంతో జగ్గంపేట నియోజకవర్గంలో నరసింహం అభిమానులు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. 2024లో జగ్గంపేట నియోజకవర్గంలో వైస్సార్సీపీ గెలుపు తధ్యమన్నారు.
ముఖ్యమంత్రి జగన్ బుధవారం కాకినాడ వస్తున్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా బహిరంగ సభకి పరిమితం చేశారు. వాస్తవానికి ఆయన కాకినాడలో నూతనంగా నిర్మించిన కొండయ్య పాలెం ఫ్లై ఓవర్, కళాక్షేత్రం, సైన్స్ మ్యూజియం, స్కేటింగ్ ట్రాక్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొనాలి. కానీ కాకినాడలో అంగన్వాడీలు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన పరిమితమవుతోంది. ఎస్పీ ఆఫీసులో హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ ప్రాంగణానికి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో శోభాయాత్ర గా వెళ్తారు. బహిరంగ సభ నుంచే వాటిని ప్రారంభిస్తారు.





Total views : 92844