ఇటీవల కాలంలో ప్రైవేట్ నెట్ వర్క్ సంబంధించిన కేబుల్ నెట్వర్క్ వైర్ తెగిపడి దానికి విధ్యుత్ ప్రవహించిగా అది మేనేజర్ కి తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ కేసు విషయం లో కేబుల్ కి సంబంధించిన మేనేజర్ స్థాయి ఉద్యోగి ని బ్యాంకు మేనేజర్ మృతి కి కారణం గనుక మాకేంటి అని సుచాయగా అడిగారు. ఇందులో కానిస్టేబుల్ ప్రసాద్ డబ్బా రైటర్ గా వ్యవహరిస్తూ ఉండడం తో కేబుల్ కు సంబంధించిన మేనేజర్ ను రెండు లక్షలు లంచంగా ఇస్తే మీకు అనుకూలం గా కేసు వ్రాస్తాను అని చెప్పాడు. అంత మొత్తం లో మేము ఇచ్చుకోలేము అని చెప్పగా చివరకు ఇరవై ఐదువేలు కు ఒప్పుకున్నారు. ఈ లంచం సొమ్ము ఎవరికి అని అడుగగా ఎస్సై వెంకట రమణ కు అని చెప్పాడు. ఈ రోజు రాజమండ్రి ఏసీబీ అధికారులను కేబుల్ మేనేజర్ సంప్రదించగా సాయంత్రం వారు ఆధ్వర్యం లో కెమికల్ పూసిన ఐదు వందలు నోట్లు ఇచ్చి స్టేషన్ కి కేబుల్ మేనేజర్ ఉద్యోగిని వెళ్ళమనగా, ఎస్సై వస్తారు అని కానిస్టేబుల్ ప్రసాద్ చెప్పాడు. కొద్దిసేపటికి ఎస్సై వెంకటరమణ స్టేషన్ కు రాగ, కేబుల్ మేనేజర్ రసాయనం పూసిన నోట్ల ను కానిస్టేబుల్ ప్రసాద్ కు ఇవ్వగా కానిస్టేబుల్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. పధకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి చేసి, రసాయనం ముట్టుకున్నా చేతులను కడిగి నిర్ధారించుకుని కానిస్టేబుల్ ప్రసాద్, ఎస్సై వెంకట రమణ లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
East Godavari
సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధిలో డ్వాక్రా మహిళలను వినియోగించడం ద్వారా, సత్ఫలితాలను పొందగలిగామని ప్రముఖ సేంద్రీయ ఆహార ఎగుమతి చేసే లోలా కంపెనీ సీఈవో తలారి శిరీష అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 2000 ఎకరాల్లో మహిళలు, రైతుల సహకారంతో సేంద్రియ ఆహార ఉత్పత్తులను సాగు చేయగలిగామన్నారు. మంగళవారం గోకవరం మండలం, వీర్లంకపల్లిలో సేంద్రీయ మామిడి వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సేంద్రియ వ్యవసాయంలో నూతన విధానాలను, రైతులకు పరిచయం చేస్తూ వారి ఆర్దిక అభివృద్ధికి లోలా కంపెనీ కృషి చేస్తుందన్నారు. రంపచోడవరం ఐటీడీఏ సహకారంతో ఇప్పటివరకు సుమారు 2000 కేజీల పసుపు, అటవీ తేనెలను విదేశాలకు ఎగుమతి చేయగలిగామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో సీటు రాజకీయ రచ్చ మళ్లీ మొదలైంది. పత్తిపాడు ఎమ్మెల్యే సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ స్పందించారు. సీఎం జగన్ మీద తనకు నమ్మకం ఉందన్నారు. తిరిగి తనకే సీటు వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు సీటు లేదని చెప్పింది. వరుపుల సుబ్బారావును ప్రత్తిపాడు నియోజకవర్గం కొత్త ఇంచార్జ్ గా అధికార పార్టీ నియమించింది. దీంతో పర్వత పూర్ణచంద్ర కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాదీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి, దీవెనలు సంపాదించుకునే కార్యచరణలో ఉన్నారు. దీంతో వరుపుల సుబ్బారావు స్పందించారు. పార్టీ ఇచ్చిన బాధ్యతల మేరకే.. నియోజకవర్గంలో కేడర్ ని బలోపేతం చేస్తున్నారని వరుపుల సుబ్బారావు అన్నారు. క్యాడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే పూర్ణచంద్ర ప్రసాద్ ప్రజాదీవెన కార్యక్రమాలను చేస్తున్నాడంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, నూతన నిర్మాణాలను పూర్తి చేసుకున్న సచివాలయాలను రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను కన్నబాబు ప్రారంభించారు. ఈ సంధర్బంగా కన్నబాబు మాట్లాడుతూ సర్పవరం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు నాయకులు సహాయ సహకారాలతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి సీనియర్ నాయకులు పుల్లా చందు, పుల్లా ప్రభాకర్, సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also..
ఈ నెల కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా సభను విజయవంతం చేయాలని జనసేన రాష్ట్ర పి. ఏ. సి సభ్యులు రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ కోరారు. కాకినాడ గుడారీ గుంట పంతం నానాజీ నివాసంలో జనసేన నాయకులతో కలిసి ఛలో తుని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన, టి.డి.పి పార్టీల పొత్తు కుదిరిన తర్వాత మొట్ట మొదటిసారిగా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ సభను తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వై.ఎస్.అర్ రహిత ఆంధ్రప్రదేశ్, వై.ఎస్.అర్ రహిత కాకినాడ జిల్లా ప్రధాన అంశంగా ఇద్దరు అది నాయకులు తీసుకున్న నిర్ణయం తో తెలుగుదేశం పార్టీ నిర్వహించే చంద్రబాబు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. వై.సి.పి ముక్త ఆంధ్రప్రదేశ్ కై ఛలో తుని సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ లబ్ధిని అందించడంతో పాటు మొత్తం పెన్షన్ దారులు కూడా మన రాష్ట్రంలోనే అత్యధికమని వనిత అన్నారు. సోమవారం నాడు కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా మంజూరైన 220 మంది పెన్షన్ దారులకు 6 లక్షల 60 వేల రూపాయల పెన్షన్ ను హోంమంత్రి స్వహాస్తాలతో అందజేశారు. దీంతో కొవ్వూరు రూరల్ మండలంలో పెన్షన్లు 10266 నుండి 10,438కి పెరిగాయి. వైఎస్సార్ పెన్షన్ కానుక క్రింద పెన్షన్ల ఖర్చు మొత్తం మూడు కోట్ల మూడు లక్షల తొంబై తొమ్మిది వేల రూపాయలకు పెరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… కొవ్వూరు నియోజకవర్గంలో ఈ ఒక్క నెలలోనే 620 మందికి నూతన పెన్షన్లు అందజేశామన్నారు. చాగల్లు మండలంలో 126 మందికి, తాళ్లపూడి మండలంలో 189 మందికి, కోవ్వూరు టౌన్ లో 85 మందికి, కొవ్వూరు రూరల్ మండలంలో 220 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ జనవరి నెల నుండి కొవ్వూరు నియోజకవర్గంలో మొత్తం 32,298 మందికి 9 కోట్ల 48 లక్షల 32 వేల 500 రూపాయలను ప్రతి నెలా అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి పెన్షన్ ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నాలుగు రోజుల పాటు గన్నవరంలో శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈనెల 7 వ తారీఖు నుండి 10 వ తారీకు మధ్యాహ్నం వరకు ఈ యాగం నిర్వహించనున్నట్లు వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ దాదాపు నాలుగు రోజులు పాటు ఈ యాగం గన్నవరంలో నిర్వహించనున్నాము. యాగం నిర్వహించడానికి ప్రధాన కారణం అక్షర కమలం ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అధోగతి పాలవుటమే, ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ రాష్ట్రా అభివృద్ధిని మళ్ళి గాడిలో పెట్టాలన్న పడిపోయిన ఆస్తుల విలువలు పెరగాలన్న ఐటీ ఉద్యోగాలు రావాలన్న ఉపాధి అవకాశాలు పెరగాలన్న పరిశ్రమలు రావాలన్న ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా కావటం తక్షణ అవసరం అని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దేవుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు కి ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాజమండ్రి కి చెందిన అర్చకులు, వృత్వికులు, వేద పండితులు 30 మందితో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని భావిస్తూ ప్రజలు ఆయనకి అవకాశం ఇస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అయినవిల్లి మండలం తొత్తరమూడి పెదపాలెం వద్ద సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా యానాం అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పి.గన్నవరం మండలానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ గత కొన్నేళ్ళుగా యానాం మద్యం షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి గుంటూరుకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. గత ఆరు నెలల నుంచి యానాం నుండి అక్రమంగా మద్యం తరలించి గుంటూరు పంపేవాడని, సోమవారం తెల్లవారు జామున తొత్తరమూడి పెదపాలెం వద్ద అయినవిల్లి ఎస్ఐ సురేష్ బాబు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీ లలో వాసంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి కారులో అక్రమ మద్యం తరలిస్తుండగా పట్టుకొని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1.35 లక్షలు విలువ చేసే అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రశాంత్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. యానాంకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని, స్విప్ట్ కారును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.
పి గన్నవరం నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్చార్జి గా నియమించిన మూడు రోజుల తర్వాత విప్పర్తి వేణుగోపాలరావు పి గన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి సాక్షిగా వైసీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. సిటింగ్ ఎమ్మెల్యేని కాదని జిల్లా పరిషత్ చైర్మన్ కి నియోజకవర్గ బాధ్యతలు అప్ప చెప్పడంపై ద్వితీయ శ్రేణి నాయకులు మండిపడుతున్నారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పి గన్నవరం వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా విప్పర్తి వేణుగోపాలరావు బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జిగా నియమితులై మొదటిసారి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న విప్పర్తికి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమానికి పి.గన్నవరం నియోజకవర్గం నాలుగు మండలాల వైసీపీ ప్రెసిడెంట్ లు గైర్హాజరు కావడంపై మరోసారి వైసీపీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న వైఎస్ఆర్సిపి నేతలు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా వేణుగోపాలరావు కు జలక్ ఇచ్చారు. కొండేటి చిట్టిబాబుని కాదని మరి ఎవరికైనా సీట్ ఇస్తే సహకరించేది లేదని కొండేటి చిట్టిబాబు వర్గీయులు ముందే తెలియజేశారు. దీనితో పి గన్నవరం నియోజకవర్గంలో వైసిపి వర్గ పోరు ఆరంభమైందని నియోజకవర్గం అంతట గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ వైసిపి ముఖ్య నేతలు గైర్హాజరు పై స్పందిస్తూ అలాంటిదేమీ లేదు అని కొత్త ఇంచార్జ్ విప్పర్తి వేణుగోపాల్ కవర్ చెయ్యడానికి ప్రయత్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం అమలు చెయ్యాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే…తమను అత్యవసర సేవల్లోకి తీసుకొస్తూ జీవో ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడు ఉద్యోగుల పై ఎస్మా ప్రయోగిస్తే ఎం జరిగిందో…రాబోయే రోజుల్లో వైసీపీకి కూడా అదే పరిస్థితి వస్తుందని సీఐటీయూ నాయకులు ఎద్దేవా చేశారు.




Total views : 92820