అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం GVK ప్రైవేట్ school లో 1st క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఆకతాయిగా డ్రైన్ క్లీనర్ పౌడర్ తీసుకొచ్చి తినడంతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది దగ్గరలో ఉన్న రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయించగా ఇద్దరు పిల్లలకు అస్వస్థత ఎక్కువ ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం మీద తీవ్ర ఆగ్రహం చూపిస్తున్నారు.
East Godavari
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు అనుమతులు తీస్కుని మరికొందరు అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపి వందల కోట్లు సంపాదిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతి అనేదే లేకుండా అందరికీ ఇళ్ల స్థలాలను మట్టి ఫిల్లింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు నామ మాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత ఈ మట్టి తవ్వకాల వెనుక ఉండటంతో అధికారులేవ్వరు అక్రమ మట్టి తవ్వకాలవైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయడం లేదంటే అధికారులపై ఎలాంటి వొత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ హయాంలో మాజీమంత్రి చినరాజప్ప అనుచరులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు మట్టి తవ్వకాలు చేస్తే…వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కేవలం చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రమే తవ్వకాలు చెయ్యాలని అధికారులకు హుక్కుం జారీ చేయడంతో ఇతరులు ఎవ్వరు రామేశం మెట్టలో మట్టి తవ్వకాలు జరిపినా అధికారులతో దాడులు జరిపించి భారీ మొత్తంలో జరిమానా విధించడంతో ద్వారంపూడి అనుచరులు కానీ వారు ఎవ్వరూ రామేశంమెట్టలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మెట్టలొ మట్టి తవ్వకాలు చేసేందుకు ద్వారంపూడి అనుచరులు ప్రయత్నించగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అడ్డుకున్నారు. నా పరిధిలో మట్టి తవ్వకాలు నా ఇష్టం ఇక్కడ తవ్వకాలు జరిపితే మర్యాదగా ఉండదని తెగేసి చెప్పడంతో ద్వారంపూడి చంటిబాబుపై కక్ష పెంచుకున్నారు. ఇందులో భాగంగానే జగ్గంపేటలో చంటిబాబును పక్కన పెట్టి నరసింహం కు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పదవి కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల రామేశంమెట్టలో మట్టి తవ్వకాలను పెద్దాపురంకు చెందిన కొందరు అడ్డుకున్నారు. మైనింగ్,రెవెన్యూ అధికారులతో దాడులు చేయించి 13 టిప్పర్లు, 2ఎక్స్కవేటర్లు సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న ద్వారంపూడి సీజ్ చేశారు కదా ఫైన్ కట్టించుకుని వదిలేయండి అంటూ రుసరుసలాడుతూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎక్కడ సీజ్ చేసిన వాహనాలకు అక్కడే ఫైన్ వేసి వదిలేశారు. నాలుగున్నర ఏళ్లలో ఎప్పుడు లేనిది పెద్దాపురం వైసీపీ నేతలు మట్టి తవ్వకాలు అడ్డుకోవడంతో ఖంగు తిన్న ద్వారంపూడి ఎలాగైనా మట్టి తవ్వకాలు తానే చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి అనుమతులు తీస్కుని తవ్వకాలు చేస్తే ఎలా అడ్డుకుంటారో చూస్తానని తన అనుచరుల వద్ద ద్వారంపూడి అనట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే మట్టి తవ్వకాలు అడ్డుకోవాల్సిన విపక్ష నేతలు మాత్రం రామేశం మెట్టకు వెళ్లకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం…
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో డ్వామా పిడి అడపా వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించి ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ పథకం క్రింద పని దినాలు, చెల్లింపులకు సంబంధించి గ్రామాల వారీగా ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా వెంకట లక్ష్మీ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో 2023 -24 కి సంబంధించి ఉపాధి హామీ పనులు నిర్వహించిన పని దినాలు చెల్లింపులు ప్రతి గ్రామ స్థాయిలో ప్రదర్శించి ఈ రోజు మండల స్థాయిలో వాటి ఆడిట్ నిర్వహిస్తూ ప్రజా వేదిక నిర్వహించామని తెలిపారు. నూతనంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం, ప్రతి మండలానికి 60 లక్షల సి సి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో శివాలయం, విష్ణు ఆలయంలా వార్షికోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శివాలయం పూజారి వీర కుమార్ మాట్లాడుతూ శివాలయం, విష్ణు ఆలయంలకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని ఆయన అన్నారు. అలాగే అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శివాలయం, విష్ణులయం పునఃప్రారంభించి 12 సంవత్సరాల కావస్తున్న సందర్భంలో 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుపుకుని అనంతరం అన్న సమారాధన జరపటం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు పదివేల మంది భక్తులు పాల్గొటం జరిగిందని ఆయన అన్నారు.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ధనార్జేనే ధ్యేయంగా చేస్తున్న వృత్తిని మరిచి దొంగలను పట్టుకొని శిక్షించాల్సిన పోలీసులే గంజాయి సప్లై చేస్తు బాలనగర్ ఎస్ఓటి పోలీసులకు చిక్కిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. కాకినాడకి చెందిన ఎపిఎస్పి 3వ బెటాలియన్ కు చెందిన పట్నాయక్(35), శ్రీనివాస్(34) ఇద్దరు పోలీసులు..ఆరోగ్యం బాగలేదని సిక్ లీవ్ పెట్టి నర్సిపట్నం నుండి బాచుపల్లి పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న కార్మికులకు గంజాయి అమ్మడమే ప్రవృత్తిగా ఎంచుకుని ఎప్పటిలాగే Ap39Qh1769 ఈకో కార్ లో సప్లై చేస్తున్న ఏపి పోలీసులను అర్ధరాత్రి వలపన్ని పట్టుకున్నారు బాలనగర్ ఎస్ఓటి పోలీసులు..వారినుండి 22కేజిల గంజాయి 11ఫ్యాకెట్స్ తో పాటు 2మొబైల్స్,మారుతీ సుజుకీ ఈకో కార్ తో పాటు డబ్బులు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిపై నార్కొటిక్ డ్రగ్స్ సైకో ట్రోఫిక్ సబ్ స్టంసెస్ యాక్ట్ క్రింద కేసునమోదు చేసినట్టు బాచుపల్లి పోలీసులు తెలిపారు.
మాకు లబ్ధి పొందిన నాలుగు కోట్ల మంది ప్రజలతో పొత్తు ఉంది. టీడీపీ జనసేన ఒత్తులో ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతమందిని పార్టీలో చేర్చుకుంటున్నారు. మేము పార్టీలో చేర్చుకునేందుకు ఒక కమిటీని వేసాము. పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాము, 175 సీట్లు లోని పోటీ చేసే విధంగా 175 నియోజకవర్గాల్లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాము. మొదట పోటీలో ఉన్న తర్వాత పొత్తుల కోసం ఆలోచిస్తాము. మాది జాతీయ పార్టీ పొత్తులు విషయం జాతీయ నాయకులు చూసుకుంటారు. సంక్షేమం అభివృద్ధి విషయంలో మా పార్టీ జడివానల ముందుకు సాగుతుంది. సంక్షేమ విషయంలో అధికార వైసీపీ కొసరుల వెళ్తుంది..
రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా చెప్పుకోవచ్చు. అత్యధికంగా సామాజిక వర్గంగా కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ భిన్నమైన తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2014లో ఇండిపెండెంట్ గా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ విజయం సాధించారు. ఏకంగా 50 వేల ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. 2019 లో మాత్రం జగన్ గాలికి ఆయన కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం జనసేన టిడిపి బలంగా ఉన్న వర్గాల్లో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెప్పాలి అయితే ఇక్కడ వర్మ సీటు ఆశిస్తున్నారు. కానీ జనసేనకు పిఠాపురం తప్పనిసరి అని వాదన బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానికత అంశం కూడా తెరపైకి రావడం రాజకీయంగా కలవరం సృష్టిస్తుంది. ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా ఉన్న ఉదయ శ్రీనివాస్ రాజమండ్రి దగ్గర కడియంకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని జనసేన నాయకుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దేందుకు మాత్రమే ఉదయ్ శ్రీనివాసన్ పంపించారనేది మరొక వాదన అయితే ఉదయ శ్రీనివాస్ కు సీటు పక్కా అని పవన్ కళ్యాణ్ ఇంట్లో మనిషిగా ఉదయ శ్రీనివాస్ కు పేరు ఉందని ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పిఠాపురం ప్రత్యేక స్థానంలో ఉంది. ఇందుకు గతంలో తెలుగుదేశానికి పడ్డ ఓట్లే ఉదాహరణగా చెబుతున్నారు. జనసేన బలంగా ఉన్నప్పటికీ లోకల్ ఫీలింగ్ బయటకు రావడంతో ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఇక్కడ సీటును తెలుగుదేశానికి కేటాయించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క అధిష్టానం కూడా ఎటు తేల్చకపోవడంతో ఈ సీటు ప్రస్తుతం గందరగోళ పరిస్థితిని నెలకొల్పిందనే చెప్పాలి. ఆఖరి నిమిషం వరకు పిఠాపురం సీటు తేల్చాలని ప్రతిసారి ఇలాగే చేసి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఆయా పార్టీల అభిమానులు ఎవరో ఒకరికి సీటు వస్తుందని పక్కాగా చెబితే ఆ దిశగా మేము కార్యక్రమాలు చేస్తామని అప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదని జనసేన టిడిపి కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క వైసీపీ ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దొరబాబును పక్కనపెట్టి కాకినాడ ఎంపీ వంగ గీతకు ఇన్చార్జ్ పగ్గాలు అప్పగించారు. పిఠాపురం సీటు విషయంలో ఎమ్మెల్యే మరో దారి లేక పార్టీ వెంటే ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం రాజకీయ పరిస్థితి చూస్తే జనసేన టిడిపి పోటాపోటీగా సీటు కోసం పాకులాడుతున్నాయి. మరోపక్క పిఠాపురం స్థానం నుండి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే ఎవరికీ గొడవ ఉండదని నెగ్గించుకుంటామని టిడిపి జనసేన అభిమానులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పిఠాపురం సీటు విషయంలో చివరి వరకు డైలమా తప్పదని ఇది గతం నుండి ఆనవాయితీగా వస్తుందని స్థానికులు అంటున్నారు.
వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చాలమ్మలశెట్టి సునీల్ పేరు ఖరారు అయింది.. వైసీపీ అయిదవ జాబితాలో ఆయన పేరు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈయన కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం నాలుగో సారి. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమిని ఎదుర్కొన్నారు. 2019లో టీడీపీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి బాట పట్టారు. అప్పటినుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆరు నెలల క్రితం వైసీపీలో చేరారు. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ అడిగారు. కానీ పార్టీ అధిష్టానం ఆయనకు కాకినాడ ఎంపీ టికెట్ కేటాయించింది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించడంతో ఎంపీగా సునీల్ పేరు ఖరారు చేసారు. వరుసుగా మూడుసార్లు ఓడిపోయిన సానుభూతి నేపథ్యంలో నాలుగవసారి గెలుస్తారు అన్న చర్చ జరుగుతోంది. విదేశాలలో పెద్ద ఎత్తున వ్యాపార వాణిజ్య కేంద్రాలు నిర్వహించే సునీల్ రాజకీయ అరంగేట్రంతోనే ఓటమి చవి చూసారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన గెలుపు బాట పడతారా అనే చర్చ జరుగుతోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంగాను, రాజకీయ దురందుల కోటగాను పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మెట్ట ప్రాంతంలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. తాజాగా మారుతున్న కాలాన్ని బట్టి పెరుగుతున్న రాజకీయ పార్టీల తాకిడితో మెట్ట ప్రాంతమైన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట లో రాజకీయం రసవత్తరంగా మారింది. CVR న్యూస్ ప్రత్యేక కథనం మెట్ట ప్రాంతంగా పిలవబడే జగ్గంపేటలో ఆది నుంచి పంతం, తోట, జ్యోతుల కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. ఈ మూడు కుటుంబాలకు ఉభయగోదావరి జిల్లాలోని అన్ని పార్టీల నాయకులతో కుటుంబ బాంధవ్యాలు పెనవేసుకుని ఉన్నాయి. దీనితో రాజకీయంగా ప్రధాన పార్టీలు ఆయా కుటుంబాలను కాదని గత ఐదు దశాబ్దాలుగా మరొకరికి ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. తాజాగా కొత్త పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయా కుటుంబాలకు దగ్గర బంధువులే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.
జగ్గంపేట రాజకీయం ఒక చిత్రం పరిశీలిస్తే ప్రస్తుత శాసనసభ్యుడిగా వైకాపా నుంచి జ్యోతుల చంటిబాబు ఎన్నికయ్యారు. ఈయన రాజకీయ దురంధరుడు గా పేరుగాంచిన తన పెదనాన్న జ్యోతుల నెహ్రూ పై పోటీ చేసి గెలుపొందారు. మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఆరితేరిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట సెగ్మెంట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇబ్బడి ముబ్బడి సంక్షేమ పథకాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగనన్న పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విధంగా జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబునీ కాదని అధికార వైసిపి మాజీ మంత్రి తోట నరసింహంను జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. ఆయన పాత క్యాడర్ ను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని పటిష్టవంతం చేసే చర్యల్లో ఆయన తనదైన శైలిలో పావులు కదుపుతూ ముందుకు పోతున్నారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన కొంత క్యాడర్ మాత్రం ఎటువైపు వెళ్లకుండా గుంభనంగా ఉన్నారు. అధికార వైసిపి టికెట్ జ్యోతుల చంటి బాబు కాదని మాజీ మంత్రి తోట నరసింహం పేరు ప్రకటించగానే పార్టీలో అసంతృప్తులు పెరిగాయనే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా నియోజకవర్గ పరిధిలో వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు జోరుగానే సాగుతున్నాయి. కిర్లంపూడి ఎంపిపి,జెడ్పీటీసీ, గండేపల్లి జెడ్పీటీసీ, గోకవరం ఎంపిపి లు తమ అనుచర వర్గంతో వైసిపి నీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీటికి తోడు గ్రామస్థాయిలో కూడా టిడిపి నేత జ్యోతుల నెహ్రూ పార్టీలో చేరికలు జోరుగా సాగిస్తూ తన మార్క్ రాజకీయాలు సాగిస్తూ బలం పుంజుకుంటున్నారు.
నియోజకవర్గ స్థాయిలో వైసిపి నుండి టిడిపి లోకి జోరుగా చేరికలు పెరగడంతో అధికార వైసిపి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసంతృప్త వాదులను పార్టీలోకి తీసుకుని బలం పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి తోడు పార్టీకి దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబును సైతం దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు అధిష్ఠానం చేపట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయన కాకినాడ ఎంపిగా జనసేన పార్టీ తరుపున బరిలోకి దిగనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. పొత్తులో బాగంగా బరిలోకి జ్యోతుల కుటుంబాలు కలిసి దిగితే అధికార వైసిపి ఓటు బ్యాంక్ గండి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు పార్టీలకు సమాంతరంగా జనసేన పార్టీ జగ్గంపేట ఇన్చార్జి పాఠం శెట్టి సూర్యచంద్ర గత ఏడాదికాలంగా తన భార్యతో కలిసి ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఒక దఫా మొక్కల పంపిణీ అంటూ మరో దఫా పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు పంపిణీ చేస్తూ నిత్యం ప్రజల్లోనే పర్యటిస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. పొత్తు లో భాగంగా జగ్గంపేట టికెట్ టిడిపికి కేటాయిస్తే సూర్యచంద్ర పయనం ఎటు అనే విషయం ఆలోచింప చేస్తుంది. అధికార వైసిపి లో ఉన్న లుకలుకలు మాదిరిగానే పొత్తు కుదిరితే జనసేన లోను లుకలుకలు బహిర్గతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాకినాడ జిల్లాలో 18-19 వయసు మధ్య ఉన్న యువతను ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా కృతికా శుక్లా కోరారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 లోని అంశాలు, ఈ – ఎపిక్ కార్డుల పంపిణీ, ఈవిఎం, వివిప్యాట్ ల ద్వారా ఓటింగ్ విధానం వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఇంకా ఓటర్లుగా నమోదు కాని 18-19 మధ్య వయసున్న యువత ఉన్నారని వారికి అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.




Total views : 92509