కాకినాడ జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్(జేసీ) సీ.ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జేసీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఆయన కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి, డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, పౌరసరఫరాల సంస్థ డీఎం డీ.పుష్పమణి, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్.సూర్యప్రకాశరావు, ఏడి సర్వే బి.లక్ష్మినారాయణ, కలెక్టరేట్ ఏవో జీఎస్ఎస్ శ్రీనివాసు, వివిధ విభాగాల అధిపతులు పలువురు ఇతర అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
East Godavari
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న వెంకటరమణారెడ్డిని గృహ నిర్మాణ సంస్థ ఎండిగా బదిలీ అవడంతో అక్కడ పనిచేస్తున్న లక్ష్మీషాను తిరుపతికు బదిలీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం తిరుపతి కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని అదేవిధంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈనెల 26వ తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక మగశవంను నిప్పు పెట్టి కాలుస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల్ని చూసి వారిని వెంబడించిన వెంకటేశ్వర రావును కొట్టి రాజమండ్రి పీడింగొయ్యి పొలాల వద్ద వదలి వెళ్లారని బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వెంకటేశ్వరరావును విచారయించగా రెండు నెలలు క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకుని ఆక్సిడెంట్ మరణం అయితే 40 లక్షల రూపాయలు వస్తాయని అలోచనతో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక మగ శవాన్ని బొమ్మూరు స్మశానం లో పూడ్చిన శవాన్ని దొంగిలించి కారులో తీసుకుని వచ్చి రంగంపేట మండలం వీరపాలెం గ్రామానికి చెందిన కేతమల్ల గంగరావు పొలంలో ఎలక్ట్రికల్ ట్రాస్ఫార్మర్ దగ్గరకు తీసుకొని వచ్చి నలుగురు కలిసి నిప్పు అంటించినట్టు క్రీయేట్ చేస్తే డబ్బులు వస్తాయని చేశామని పోలీసులు సమక్షంలో నిందితులు తమ చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా DSP కిషోర్ కుమార్ తెలిపారు. వీరి వద్దనుండి 2 సెల్ ఫోన్లు, 1 కార్ స్వాధీనం చేసుకుని అనంతరం నలుగురు ముద్దాయిలని రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నామని తెలిపారు.
చదువులమ్మ తల్లి ఒడిలో వైసీపీ కరపత్రాలు పట్టుకుని విద్యార్థి విభాగం మీటింగ్ అంటూ చేసిన హడావిడి విద్యావేత్తలను ముక్కు మీద వేలు వేసుకొనిలా చేస్తోంది. కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఈ భాగోతం జరిగింది. బుధవారం ఛాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నారు. ముందు రోజు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ సమావేశానికి అనుమతి ఇచ్చారు. ఓ రాజకీయ పార్టీ సమావేశానికి యూనివర్సిటీని ఎలా అనుమతిచ్చారంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జగనన్న కాలేజీ కెప్టెన్సి పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మళ్ళీ జగన్ ను సీఎం చేయాలంటూ ఈ కార్యక్రమంలో పిలుపునివ్వడం, జగన్ ఫోటోలతో ఉన్న టీ షర్ట్ లు విద్యార్థులు ధరించడం వివాదం అయింది. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమానికి ముందు రోజు వైసీపీ జెండాలతో యూనివర్సిటీని నింపేయడం పట్ల విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. విసీ అసమర్ధతకు ఇది నిదర్శనమని కాలేజ్ ప్రొఫెసర్లు కూడా అంగీకరిస్తున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్రంలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం. నేరుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే రానురాను ఇక్కడ పార్టీ బలహీనపడుతోందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇంచార్జిలు మారారు. ఇలాంటి నేపథ్యంలో స్థానికుడు, విద్యావేత్త, కడారి తమ్మయ్య నాయుడు పేరు తెరిపైకొచ్చింది. పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ లేదంటే తమ్మయ్య నాయుడుకి సీటు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఇంచార్జ్ ఉదయ శ్రీనివాస్ పనితీరు సరిగా లేకపోవడంతో తమ్మయ్య నాయుడుకు టికెట్ ఇస్తారన్న వాదన పెరుగుతోంది.
యానాం.. స్థానిక శ్రీకృష్ణదేవరాయ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాయి అనే ఏడేళ్ల బాలుడు జిఎంసి బాలయోగి క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి చెందాడు. బాలుడు మృతదేహాన్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రికి యానాం పరిపాలన అధికారి మునుస్వామి, విద్యాశాఖధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ వచ్చి బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. యానాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రావులపాలెం జాతీయ రహదారి డిగ్రీ కాలేజీ ఎదురుగా లారీ రిపేర్ కు రావడం తో లారీ నిలిచిపోగా దానిని డ్రైవర్, క్లీనర్ లారీ కింద ఉండి బాగు చేసుకుంటున్నారు. ఈలోగా రాజమండ్రి వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్నా టిప్పర్ లారీ ఆగి ఉన్న లారీ ని ఢీకొట్టడం తో లారీ కింద ఉండి బాగుచేసుకుంటున్న డ్రైవర్, క్లీనర్ లు పైకి లారీ దూసుకెళ్లడం తో ఆక్కడకక్కడే ఇద్దరు మృతి చెందారు. అలాగే టిప్పర్ లారీ కేబిన్ ఆగి ఉన్న లారీ వెనుక భాగం లో ఇరుక్కు పోవడం తో ఇందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు మధ్య లో ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న పోలీస్ లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 108 అంబులెన్సు సిబ్బంది, హైవే రెస్క్యూ టీం అక్కడికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రిలో రా కదిలిరా సభలో చంద్రబాబు నాయుడుకి ప్రమాదం తృటిలో తప్పింది. చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో సాల్వలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకు టిడిపి నేతలు రావడంతో.. ఆ తోపులాటలో స్వల్పంగా చంద్రబాబు నాయుడుని తోయడంతో.. ఉలిక్కిపడ్డ చంద్రబాబు నాయుడిని పట్టుకున్న వ్యక్తిగత సిబ్బంది.. సెక్యూరిటీ గార్డ్స్ అలెర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.
ఏలేశ్వరం నియెజకవర్గము లో ఈ సందర్భంగా మూది నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకి తీరని అన్యాయం చేశారని, తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే బీసీలకి అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవని బీసీలందరూ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులు అందరూ ఈ సమావేశానికి హాజరు అవ్వాలని కోరారు.
సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని తుని తపోవన పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు. సీవీఆర్ న్యూస్ కు సంబంధించిన 2024 క్యాలెండర్ను సరస్వతి స్వామీజీ తపోవన పీఠంలో ప్రత్యేకంగా ఆవిష్కరించారు. తుని నియోజకవర్గానికి సంబంధించిన సీవీఆర్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ మణికంఠ మర్యాదపూర్వకంగా నూతన సంవత్సర క్యాలెండర్ ను సరస్వతి స్వామీజీకి అందజేయగా సరస్వతి స్వామీజీ ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు. తెలుగు ప్రజలకు సీవీఆర్ యాజమాన్యానికి సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తెలియజేశారు.




Total views : 92563