కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు కలకలంరేపాయి. గ్రామంలోని ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించాయి. సమాచారం తెల్సుకున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు. గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తి వింత శబ్దాలు చేస్తూ గ్రామంలో తిరుగుతున్నాడని ప్రచారం జరగడంతో గ్రామంలో పోలీసులు, గ్రామ యువకులు పహారా కాస్తున్నారు.
East Godavari
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు వైయస్సార్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఒకవైపు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతుండగా మరోవైపు మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైయస్సార్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అయినప్పటికీ ఏదైనా విద్యాసంస్థలో ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులను తెలుసుకొని విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులను లేదా ప్రధాన అధ్యాపకులను సంప్రదించి అనుమతి తీసుకుని నిర్వహించవలసి ఉంటుంది కనీస సమాచారం లేకుండానే కళాశాలలో సభ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యారు. భారీ మైకు మోతలు ఒకవైపు సభకు భారీ సంఖ్యలో హాజరైన డ్వాక్రా మహిళల రణగొణ ధ్వనులు మరోవైపు మోగిపోవడంతో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు అసహనానికి గురయ్యారు. వాస్తవానికి సభ మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరగనున్నప్పటికీ ముందుగానే సభికులు, మైక్ సౌండ్లు ప్రారంభం కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లు వెల్లుతున్నాయి. 12 గంటలకు పరీక్ష పూర్తవుతున్నందున మధ్యాహ్న సమయంలో సభ నిర్వహించుకుని ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండకపోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెపుతారు. నిజంగా పార్టీ ఇక్కడ బలంగా ఉంది. కానీ గత కొంతకాలంగా అసమ్మతి పెరిగింది. తొలుత పిఠాపురం ఇన్చార్జిగా మాకినీడి శేషు కుమారి వ్యవహరించారు. హఠాత్తుగా ఆమెను తొలగించి పార్టీ అధినేత పవన్ కు సన్నిహితుడైన టీడీపీ అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాసును నియమించారు. ఆయన రావడంతోనే ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొంత కాలం పాటు ఉదయ శ్రీనివాస్ కార్యక్రమాలు సాఫీగానే జరిపారు. ఇదే పార్టీలో సీనియర్లను గుర్తించడం లేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ పిల్లా శ్రీధర్, అదే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు వచ్చినప్పుడు గొల్లప్రోలులో ఆయన బస చేసిన ఇంటి అధినేత, విద్యావేత్త, సీనియర్ నేత ఇలా ఎందరినో తంగిళ్ళ పట్టించుకోవడం లేదు. వారంతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ ప్రాధాన్యత లేదని వాపోతున్నారు. మరోపక్క టీడీపీ ఇన్చార్జి వర్మ తానే అభ్యర్థని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవలసిన ఉదయ శ్రీనివాస్ ఏకపక్షధోరణి పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన నాయకులు పిఠాపురం సమావేశంలో కుర్చీలతో కొట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా జనసేనకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి.
కాగా రెండు రోజుల క్రితం పిఠాపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు జనసేనలో కలవరాన్ని పుట్టిస్తున్నాయి. జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ స్థానికేతుడు అంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తంగేళ్ల అనుచరులు దీనిపై మండిపడుతున్నప్పటికీ ఆయన వ్యతిరేకవర్గం మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది. అయ్యన్నపాత్రుడు నిజమే చెప్పాడని వారు వ్యాఖ్యనిస్తున్నారు. జనసేన రెండో వర్గం అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను సమర్ధించడం మరో వివాదాస్పదమైంది.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉదయం పొలం పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లే సరికి మంట కనిపించడంతో వైర్లు దొంగలించేందుకు వచ్చారని వాళ్లపైకి వెళ్లడంతో అప్పటికే ఒక మగ శవాన్ని కాలుస్తున్న వారు వెంకటేశ్వరరావు ని కొట్టి ఆటోలో తీసుకుని పీడింగొయ్యి వద్ద పొలాల్లో వదిలి వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ పూర్తిగా కాల్చి ఉన్న శవం పక్కన వెంకటేశ్వరరావు చెప్పులు, ఫోన్, బండి చూసిన బంధువులు వెంకటేశ్వరరావు శవం గా భావించి చనిపోయాడు అని భావించారు. అనంతరం కొద్ది గంటల సమయం తరువాత వెంకటేశ్వరరావు వాళ్ళ భార్యకు ఫోన్ చేసి నేను బ్రతికె వున్నానని చెప్పేసరికి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నేరస్తులను పట్టుకుంటామని తెలిపారు.
అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ను టీవీ లో వీక్షించి ఒక్క సారిగా కుప్పకూలి మృతి చెందిన ఎస్.మూలపాలెం గ్రామ ఉపసర్పంచ్ మోరంపూడి మీరా సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించి మూడు లక్షల రూపాయల చెక్ ను నారా భువనేశ్వరి అందజేశారు. అనంతరం కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి బయలుదేరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి నిజం గెలవాలి యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించినవారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడలో పర్యటించనున్నారు. రేపు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. ఎల్లుండి అనపర్తి నిడదవోలు, కొవ్వూరు, రాజానగరంలో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందిస్తారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో గొల్లపాలెం నుంచి ద్రాక్షారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున లోకేష్ కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నేతృత్వంలో జనసేన సహకారంతో రెండు పార్టీలు అధికారంలోకి రావాలని కోరుతూ పూజలు నిర్వహించారు. వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కని విని ఎరుగని రీతిలో స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి తన యువగళం ద్వారా కొత్త ఉత్సాహాన్ని తెచ్చిన లోకేష్ మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసామని అదే విధంగా లోకేష్ ఆసయాలకు అనుగుణంగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించమని వీర్రాజు చౌదరి తెలిపారు.
కాకినాడ ప్రగతి భవన్ లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డ్రైనేజీ డివిజన్ కార్యాలయం లో త్రిమూర్తులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. పింఛన్ల బకాయిలు మంజూరు కోసం ఈఈ ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ స్వామి 16 వేల రూపాయలు డిమాండ్ చేశారు. త్రిమూర్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకుంటున్న ఈఈ ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ స్వామిలను పట్టుకున్నారు.
Read Also..
Read Also..
తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపిలో కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథక ఇవ్వొద్దంటూ ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆటో యూనియన్ సంఘాలు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ఆటోలతో ఆందోళన చేపట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి డ్రైవర్ల పొట్ట కొట్టొద్దని నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులకు తమ ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు మండలంలోని ఈ గోకవరంలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ ను, కిత్తమురుపేటలో గల చంద్రబాబు సాగర్ ను, ఏలేశ్వరం మండలంలో ఏలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ ప్రాజెక్టు అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని ఆమె అన్నారు. సుబ్బారెడ్డి సాగర్ కు పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. అలాగే చంద్రబాబు సాగర్ కు పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ నిండుకుండలా ఉండే ఏలేరు ప్రాజెక్టుకు మరింత నీరు అందించేందుకు పురుషోత్తమ పట్నం పనులు చేపట్టి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌కు గత ప్రభుత్వంలో నీరు అందించడం జరిగిందని అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా నీరు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలూరు ప్రాజెక్టు నుండి స్టీల్ ప్లాంట్ కు వెళ్లే నీటిని శంఖవరంలో ఒక కెనాల్ ను, పెద్దిపాలెంలో ఒక కెనాల్ ను ఏర్పాటు చేసి రైతులకు నీరు అందించే విధంగా చూడాలని అన్నారు.




Total views : 92622