బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఒక భవనాన్ని పునర్నిర్మించి పోలీస్ డాగ్ స్క్వాడ్ విభాగానికి అనుకూలంగా పోలీస్ జాగిలాలకు కెన్నెల్స్ ఏర్పాటు చేసి నవంబర్ 9న గురువారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా వేదమంత్రాల నడుమ జరిగిన పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనo ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు, మిస్టరీగా మారిన కేసులలో నిందితుల ఆచూకీ కనుగొనడంలో జాగిలాలు పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. మనుషులకు సాధ్యం కాని పనిని జాగిలాలు సునాయాసంగా చేస్తూ నేర పరిశోధనలో పోలీస్ శాఖకు విశేష సేవలు అందిస్తున్నాయన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, పేలుడు పదార్థాలను గుర్తుంచడంలో జాగిలాల పాత్ర కీలకమైనదని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం టైగర్ (స్నిఫర్), ఫాక్సీ (ట్రాకర్), షాడో (ట్రాకర్), బిట్టు (స్నిఫర్), చెర్రీ (స్నిఫర్), బికో (స్నిఫర్) అను 6 జాగిలాలు ఉన్నాయన్నారు. జాగిలాలను సంరక్షించడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో జిల్లాలోని వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ లోని ఒక భవనాన్ని పునర్నిర్మించి అందులో జాగిలాలకు అవసరమైన కెన్నెల్స్ నిర్మించి, జాగిలాలను సంరక్షించే సిబ్బంది ఉండడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. పోలీస్ జాగిలాలు, వాటి సంరక్షకుల కొరకు నిర్మించిన “పోలీస్ డాగ్ స్క్వాడ్” భవనాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు.
Guntur
ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి వెళ్లనున్నారు. సీఎం జగన్ పలు వివాహ వేడుకల్లో పాల్గోనున్నారు. జగన్ ఆ తర్వాత పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయం, శిల్పారామాన్ని ప్రారంభించనున్నారు. రాత్రికి ఇడుపులపాయ లో వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేసి రేపు ఉదయం 8.30కు ఇడుపులపాయలో ఆర్ కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించి రేపు మద్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో టిడిపి శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు…టీడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా ర్యాలీ….ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి చదలవాడ అరవిందబాబు ,డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…టీడీపీ సానుభూతి పరుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై అక్రమ మద్యం కేసు బనాయించిన రొంపిచర్ల ఎస్సై రవీంద్ర ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు…కార్యక్రమం టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నుండి కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయాల వరకూ టిడిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు…పల్నాడుజిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు… ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ….రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం కు చెందిన గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లీలా మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ టీడీపీ కి సానుభూతిపరుడుగా వ్యవహరిస్తున్నాడన్న అక్కసుతో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసులతో అక్రమ మద్యం కేసు బనాయించి రిమాండ్ కు పంపడం దారుణమైన చర్య అన్నారు… ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు వ్యవహరించారన్నారు…చిన్న తనం నుండి మద్యం అలవాటు లేని గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై మద్యం విక్రయిస్తున్నాడని కేసు బనాయించి రిమాండ్ కు పంపడాన్ని టీడిపి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు…ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ రొంపిచర్ల ఎస్సై రవీంద్ర పై ప్రయివేటు కేసు వేస్తామని టిడిపి నాయకులు అన్నారు…రొంపిచర్ల ఎస్సై రవీంద్ర రొంపిచర్లలో ఇటీవల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించి ఒక గ్రామంపై అసందర్భమైన వ్యాఖ్యలు చేశారని టిడిపి నేతలు ఆరోపించారు…
మాచర్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి అనే కార్యక్రమం రేపటినుండి ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు మొదలుకొని జడ్పిటిసిల వరకు నియోజకవర్గంలోని అందరు నాయకులు హాజరవుతారని అన్నారు . కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా భయపడకుండా అటు సంక్షేమాన్ని అమలుచేసి ఇటు కరోనాను కూడా ధైర్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 140 హామీలు గాలికి వదిలేసారని , స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 371 కోట్లు అడ్డంగా దోచుకుని దొరికిపోయారని అన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెబుతున్న తెలుగుదేశం నాయకులకు రాష్ట్రానికి కొత్తగా వచ్చిన నాలుగు ఓడరేవులు, 10 షిప్పింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు ,రెండు విమానశ్రయాలు కనబడటం లేదా అని అన్నారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాచర్లకు విచ్చేసి 1,20,000 ఎకరాల వ్యవసాయ సాగుభూమికి నీరు అందించేందుకు వరికపొడిసెల ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. వినుకొండ ప్రకాశం మాచర్ల నియోజకవర్గం ప్రజలు ఆరోజు పాల్గొని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలని కోరారు.
ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల వల్ల ఈ నెల 28వ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇసుక కేసులో చంద్రబాబును ఏ2గా సీఐడీ పేర్కొంది.
Read Also..
ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలవనున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఏపీలో ఓట్ల అవకతవకలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయనున్న టీడీపీ.. నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారనే అంశంపై డేటా తయారు.. ఫాం-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి స్పష్టం చేయనున్న టీడీపీ నేతలు..
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో వల్లపు చెరువు సమీపంలో అనుమానాస్పద మహిళ మృతదేహం. మృతిరాలి వయస్సు సుమారు 60సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన నరసరావుపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.





Total views : 75192