మచిలీపట్నంలో వైసీపీ, టీడీపీ నేతల మాటలతో బందరు రాజకీయం రసవత్తరంగా మారింది.మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏమ్మెల్యే పేర్ని నానిపై తీవ్రస్తాయిలో విమర్శలు చేసారు. బందరు ని గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ,కమిషన్ల కోసం, గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పోర్టు నిర్మాణం పై ఎంత పని జరిగిందో స్వేతపత్రం విడుదల చేస్తారా అనీ డిమాండ్ చేసారు.ఇసుకని యదేచ్చగా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు తనను గెలిపిస్తే కొడుకుకి అధికారం ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
Krishana
విజయవాడ సెంట్రల్ అజిత్ సింగ్ నగర్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,వైసీపీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…విజయవాడ నగర అభివృద్ధి విస్తరించడంతో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఈ నూతన పోలీస్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం అనీ తెలిపారు.
మాజీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాన్నారు. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, తర్వాత దర్గాకు కూడా వెళతానన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని కోరానని తెలిపారు. తన శేష జీవితం ప్రజలకు అంకితమిస్తున్నానన్నారు. నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారన్నారు. తన బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారని.. కొంతమంది ప్రాణ త్యాగాలు కూడా చేశారన్నారు. నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని.. ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా.. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకునన్నారు.
కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులతో సమావేశం అయ్యారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్ ముప్పు దృశ్య జిల్లా అధికారులు ఎవరూ సెలవు పెట్టరాదని, నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. వాతావరణం మార్పుతో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు అధికారులు వెనకకు రప్పించారు. సముద్ర ప్రాంతములో తీవ్రమైన గాలులు వీచడంతో పడవలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సముద్రంలో బలమైన గాలులు వీస్తున్నాయని, అలలు ఉవ్వెత్తిన ఎగసిపడుతున్నాయని ప్రతి సంవత్సరం నవంబర్ వచ్చిందంటే తుఫాన్లు తప్పడం లేదని దీంతో నష్టపోవడం జరుగుతుందని గంగపుత్రులు వాపోతున్నారు. మత్యకారులును సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ నిషేధాజ్ఞలు అధికారులు జారీ చేశారు.
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం, డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ(37) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కు ప్రయత్నించింది. హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవల విభాగంలో నర్సులు డాక్టర్ కు ఫోన్ చేసి, డాక్టర్ చెప్పిన విధంగా వైద్యం అందించారు. డాక్టర్ లేకుండా నర్సులు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి రావడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. శనివారం శ్రమ శక్తి భవన్లో హైబ్రిడ్ మోడ్‌లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకుపైగా కేంద్ర జలశక్తి శాఖ అధికారుల సమావేశం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో ఏపీ, తెలంగాణ అధికారులు విడుదల చేస్తారని సెంట్రల్ వాటర్ కమీషన్ ఛైర్మన్ వెల్లడించారు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను గా మారి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్షించారు. రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని సీఎస్ వివరించారు. తీరప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సన్నద్ధం చేసినట్లు తెలిపారు. తూర్పు నౌకాదళ కమాండ్ కూడా అత్యవసర సామగ్రి, నౌకలతో సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.
ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం. అందుబాటులో ఉండని డ్యూటీ డాక్టర్లు. కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ(37) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది వెంటనే ఆవిడను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, అత్యవసర సేవల విభాగంలో ఉన్న నర్సులు డాక్టర్‌కు ఫోన్ చేసి, అతను చెప్పిన విధంగా వైద్యం అందించారు. డాక్టర్ లేకుండా నర్స్ లు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. 3.47 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, 33/11 కరెంటు సబ్ స్టేషన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. పామర్రు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం జగన్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలకు అభివృద్ధిపై చర్చించే దమ్ము లేదని వైసిపి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అందుకే పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. 35 లక్షల నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజీపీ మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడమే తమ పార్టీ విధానమని అన్నారు. సామాజిక సాధికారిత పేరిట బస్సు యాత్ర చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను రద్దు చేసిన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. సబ్ ప్లాన్‌ను కేంద్రం రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.






Total views : 197910