తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు.. డివిజన్ పరిధిలో తెలంగాణ సరిహద్దుగా ఉన్న 7మండలాల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 5 చెక్ పోస్టులు ఏర్పాటుచేశామని ఏ సి పి రమేష్ అన్నారు. డివిజన్ పరిధిలో 330 మంది రౌడీ షీటర్లు, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కలిగిన వ్యక్తులను బైండోవర్ చేశామని ఏ సి పి అన్నారు. 27గ్రామాలు తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో అయా గ్రామాల్లో పోలీస్ నిఘా, పటిష్ఠ బందోబస్తు ను కల్పించడంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పామని ఏ సి పి అన్నారు. 166 మద్యం కేసులు నమోదు చేసి 1078 బాటిళ్లు, 18 లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ తనిఖీల్లో తిరువూరు సిఐ అబ్దుల్ నభి, ఎస్సైలు వి.సతీష్, ఏ పద్మారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Krishana
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ కలకలం రేపింది. ఇసుక దోపిడీకి నిరసనగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో.. ఇసుక కుప్పపై కూర్చొని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి.. విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు తరలించారు. ఇసుక దోపిడీని ఆపకుండా అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై దేవినేని ఉమా మండిపడ్డారు. దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే.. ప్రశ్నిస్తున్న తమ నోరు నొక్కాలని చూస్తున్నారన్నారు.
ఆయనొక ఏఈఓ … విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తూ.. ఆలయానికి వచ్చిన భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి.
కానీ ఆయన మాత్రం నోరు విప్పితే చాలు పచ్చి బూతులే.. గతంలోనూ పలుమార్లు బూతులు తిడుతూ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఆలయ సన్నిధి వద్ద విధులు నిర్వహించే అర్చకులను సైతం బూతులు తిడుతూ, ఒక ధర్మ కర్తను బూతులు తిడుతూ మాట్లాడిన తీరు పై.. పాలక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే సదరు ఏఈఓపై భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
చేతికొచ్చిన వరి పంట దక్కించుకోవడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు. ఆకాశం ఒక్కసారిగా మేగావృతమై చిరుజల్లులు పడటంతో పండించిన పంట చేతికి రాదేమోనని రైతు గుండెల్లో గుబులు మొదలైంది. కృష్ణ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలంలో బిపిటీ సన్న విత్తనాలతో రైతులు వరి సాగుచేశారు. చేతికొచ్చే పంటను కాపాడుకోవడానికి యంత్రాల సహాయంతో కోసి ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చుకున్నారు. ఒక్క ఎకరాకు 40 నుంచి 45బస్తాలు, హెక్టార్లుకు 100 నుంచి 115బస్తాల దిగుబడి వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 76 కేజీల ధాన్యం ధర 17వందల రూపాయలు… క్వింటాలు ధాన్యం ధర 2వేల 300 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తేలియజేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని చల్లపల్లి , మోపిదేవి, ఘంటసాల మండలాలలో రైతాంగం పలు రకాల వరి వంగడాలపై ఆసక్తి చూపారు. అయితే రైతులు ఆశించిన విధంగానే ఎకరాకు 38 నుంచి 44 బస్తాల దిగుబడి వస్తుంది. క్వింటల్ ధాన్యం ధర 2వేల 200 రూపాయలకు కోనుగోలు చేస్తున్నారు. మంచి దిగుబడి రావడంతో.. రైతులు పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది.
2006లో టీడీపీ కార్యకర్త నరసింహయ్య పై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో తొమ్మిది మందికి నందిగామ 16వ అదనపు న్యాయమూర్తి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులో ఈ హత్య జరిగింది. 2006 సెప్టెంబర్ లో వినాయక విగ్రహం ఊరేగింపు సమయంలో కాంగ్రెస్ వర్గీయులు నరసింహయ్యపై రాళ్లతో దాడి చేశారు. ఈ కేసుకు సంబంధించి మచిలీపట్నం జిల్లా కోర్టులో గతంలో ట్రయల్ నడిచింది. ఆ తర్వాత నందిగామలో జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టు రావడంతో కేసును ఈ కోర్టుకు బదిలీ చేశారు. గతంలో ఈ కేసుపై స్టే విధించిన హైకోర్టు… ఆ తర్వాత స్టేను ఎత్తివేసింది. ఈ క్రమంలో ఇరువైపు వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. నేరం రుజువు కావడంతో తుది తీర్పును ఇచ్చారు. యావజ్జీవ కారాగారశిక్ష పడినవారిలో పగడాల సుబ్బారావు, యండ్రాతి శ్రీనివాసరావు, నెల్లూరి నరసింహారావు, యండ్రాతి పూర్ణచంద్రరావు, రమణ, గూడపాటి పుల్లయ్య, ఈవూరి వసంతరెడ్డి, హనుమయ్య, గుత్తా నారాయణరావు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వైసీపీలో కొనసాగుతున్నారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలి. అధికారంలో ఉండగా చేయలేని పనులు వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా లక్షల మంది పేద కుటుంబాలలో వెలుగులు రాజశేఖర్ రెడ్డి నింపారు. అదే బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచాడు. వృద్ధులు, వికలాంగులు ఏనాయకుడు వద్ద పడిగాపులు పడకుండా 1వ తేదీన ఇంటివద్దనే ఫెంక్షన్ అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఒక్క సంక్షేమ పధకం కూడా ఆపలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులో కొన్ని అప్పులు చేయడం సహజం. గత ప్రభుత్వాలు అప్పులు చేయకుండా జేబులో డబ్బులు ఖర్చు చేశారా????? పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది పప్పు బెల్లాలు లాగా పెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ విధానాన్ని మార్చడం షావుకారులకు కడుపు మంటగా ఉంది. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా రాష్ట్రాన్ని అప్పులుపాలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడా కష్టం రాలేదు. కష్టం వచ్చింది కేవలం చంద్రబాబుకి మాత్రమే. ధనికులు పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదివితే ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే అర్ధం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని గ్రామాల్లో చెప్పి చేయలేని పరిస్థితి. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుంది.
కార్తీక మాస పౌర్ణమి సోమవారం పర్వతనాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా సాగర సంగమం, సముద్ర తీరం భక్తజన సందోహంగా మారింది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తులతో తిక్కిరిసింది. సముద్ర తీరానికి సుదీర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్రునికి నమస్కరించి ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతోసముద్రవద్ద భక్తులు కు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోడూరు నుంచి సాగర సంగమం వద్దకు వెళ్లే రహదారి పూర్తిగా శిధిల వ్యవస్థ చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రుక్మిణి సత్యభామసమేత వేణుగోపాలస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Read Also..
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకిలో ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు ప్రాధాన్యత ర్యాలీలో కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతోపాటు ఆర్డీవో రాజు, తాడిగడప మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ రావు తో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు యొక్క ప్రాధాన్యతను గుర్తించాలని తద్వారా మంచి నాయకులను ఎన్నుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజబాబు కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్య పాత్ర పోషిస్తుందని అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాజబాబు అన్నారు.
Read Also..
ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించారు. ఎకరానికి ఆహార పంటకు 50,000 ఉద్యానవన పంటలకు 75000 వాణిజ్య పంటకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలి. పంట బీమా వాతావరణ బీమా పథకాలను అమలు చేసి పూర్తిగా నష్టపరిహారం ఇప్పించాలి. ఖరీఫ్ లో బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలి. వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల గురించి పంట నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలి. వేదాద్రి చింతలపూడి లాంటి చిన్న మధ్య తరహా ఎత్తిపోతల పథకాన్ని అన్ని అన్నింటికీ నిధులు కేటాయించి పూర్తి చేయాలి. నిల్వమున్న పంటలను కాపాడుకోవడానికి పగటిపాడు తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వాలి. రబిలో పంటలు వేయడానికి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ పనులు లేని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి రోజుకు 600 చొప్పున సంవత్సరానికి 1200 రోజులు పని కనిపించాలి. రబి పంటలకు అవసరమైన విత్తనాలను ఎరువులను పురుగుమందులను ప్రభుత్వం అందించాలి.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంకన్న గూడెం లో దారుణ హత్య జరిగింది. మరీదు రామాంజనేయులు అనే వ్యక్తిపై అతని సొంత అల్లుడు కట్టా సాయి కుమార్, కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలు పాలైన రామాంజనేయులను ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామాంజనేయులు మృతి చెందారు. ఈ అంశం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also..






Total views : 196772