రెడ్డిగూడెం మండలం నుండి విస్సన్నపేట ప్రవేట్ స్థలంలో భారీగా తోలక నిర్వహిస్తున్న తోలకం దారులను స్థానిక ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు.. అనుమతులు లేకుండా తోలకాలు నిర్వహిస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలుపుతున్నారు.. పక్క మండలాల నుండి మట్టితోలకాల నిర్వహించడంతో స్థానిక ట్రాక్టర్ యజమానులు ఫైనాన్స్ కిస్తీలు కూడా కట్టుకోలేక ట్రాక్టర్లు ఫైనాన్స్ వారికి అప్పగిస్తున్నామని, కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించకపోతే పరస్పరం వాహనాలు ఆపుకుని తీవ్ర స్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉంది. మద్దుల పర్వ, విస్సన్నపేట ట్రాక్టర్ల యజమానులు తోలకందార్ల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిచి ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు.
Krishana
దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది. ఇటీవల కర్నాటి చైర్మన్ నాన్న చనిపోయారు ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు, సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కృష్ణకి డబ్బులు తక్కువ ఇచ్చినందుకు దాడి చేశాడు. మద్యం మత్తులో గుంజా కృష్ణ దాడి చేశారు అని పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు. స్మశానంలోనే ఈ దాడి చేసిన వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చే తీర్మానించబడిన నినాదం ” PREVENTING ANTI MICROBIAL RESISTANCE TOGETHER “. ఈ సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు ఆధ్వర్యంలో విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ సుహాసిని మాట్లాడుతూ.. “వ్యాధుల నుంచి ఉపశమనం కోసం వాడే రోగ నిరోధక ఔషదాలే భవిష్యత్తులో వ్యాధి నిరోధక శక్తిని హరిస్తాయని, యాంటిబయాటిక్స్‌ను అతిగా వాడితే ఎన్నో అనార్థాలను కొని తెచ్చుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. యాంటి బయోటిక్స్ వైద్యుల సూచన మేరకే వాడాలని సూచించారు.
Read Also..
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. చల్లపల్లి మండలంలోని నాలుగు లంక గ్రామాల రైతులకు లీజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, బందరు ఆర్డీవో ఎం.వాణి హాజరయ్యారు. లంక భూములు సాగు చేసుకుని జీవిస్తున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మేలు కలిగేలా లీజ్ ను రెన్యూవల్ చేశామని సభాముఖంగా ఎమ్మెల్యే తెలిపారు. అర్హత కలిగిన 838 మంది లంక భూముల రైతులకు 760 ఎకరాల లీజు పట్టాలు పంపిణీ చేశారు. చల్లపల్లి మండలంలోని పాగోలు, మాజేరుల్లో 158 మందికి అసైన్డ్ భూములు, 39 ఎకరాలను 22ఏ నుంచి తొలగించి ధృవీకరణ పత్రాలు సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ప్రారంభించారు. అనంతరం తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ…. పార్టీ బలోపేతం చేయడానికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా నందిగామ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని… అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే స్థానం అనేది చాలా విలువైనదని… ఆ పదవిలో ఉంటే ప్రజలకు ఏపని అయినా చేయవచ్చని రమాదేవి అన్నారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం. బాపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పురి సాయి కల్యాణి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు……మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి పూర్తిస్థాయి బెయిల్ మంజూరైన సందర్బంగా బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు… జనసేన గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు… అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించరు.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు.తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ ఆద్వర్యంలో జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు జనసేన, టిడిపి నాయకులకు తో కలిసి గండేపల్లి మండలం యల్లమిల్లి అడ్డరోడ్డు వద్ద నుండి గండేపల్లి శివారు సింగరంపాలెం రోడ్డు వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేసిఅధ్వానంగా ఉన్న రోడ్లు పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నెహ్రూ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై టిడిపి జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారి ఇది కార్యక్రమంలో భాగంగా మూడోరోజు గండేపల్లి మండలంలో నిర్వహించామని పెద్దాపురం మండలం గండేపల్లి మండలం కోరుకొండ, గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింకు రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు అద్వాన్న పరిస్థితిలో ఉందని దీనిని వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ను ప్రమాదాల నుండి కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టామని ఈ అసమర్ధ ఎమ్మెల్యే వల్లే ఈరోజు నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని ఎన్నికల ముందు ఐదు కోట్ల రూపాయలు కేటాయించి నియోజకవర్గం లోని రోడ్లన్నీ గుంతలు ,గొయ్యలు పుట్చాలని కోరారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక మరమ్మతులు చేయవచ్చని అన్నారు. ప్రతి మంగళవారం నువ్వు తీసుకువచ్చే రిజర్వ్ బ్యాంక్ అప్పులో 1200 కోట్ల రూపాయల కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక రిపేర్లు పూర్తవుతాయని ఎన్నికల ముందు ఈ కార్యక్రమం తీసుకుని మీరు ఓట్లు కోసం రావాలని, ఎన్నికల ప్రచారం రావాలని డిమాండ్ చేసిన జ్యోతుల నెహ్రూ లేదంటే రేపు రాబోయే జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామని అన్నారు.
చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరం, త్వరలోనే స్క్వాష్ పిటిషన్ కూడా అనుకూలంగా వస్తుంది. ఎంతో పేరుగాంచిన గుడివాడ, నాని పనితనంతో గుంతల వాడగా మారింది. గుడివాడలో రోడ్లు వేయ్యనని పబ్లిక్ మీటింగ్ లో, కొడాలి నాని నీసిగ్గుగా చెబుతున్నాడు హైదరాబాద్‌లో ఉండే వ్యక్తికి గుడివాడ ప్రజల రోడ్ల కష్టాలు ఎలా తెలుస్తాయి…. ప్రజలతో సంబంధం తెగిపోయి అరాచకాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి, కొడాలి నానికు బుద్ధి చెప్పి తీరుతాం. సొల్లు వాగుడు కట్టి పెట్టీ ప్రజల్లోకి రా.. ని బడ్డారం బయట పడుతుంది. పక్క రాష్ట్రాలు మన రోడ్ల మీద జోకులు వేసుకుంటున్న సీఎంకు చిమకుట్టినట్లు లేదు. టిడ్కో ఇల్లంటే టిడిపి, చంద్రబాబే గుర్తుకు వస్తారు. తమ సొంత డబ్బులతో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వైసిపి నేతలు బిల్డప్ ఇస్తున్నారు. లెజెండ్ అయిన చంద్రబాబు గొప్పతనాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు కాలిగోటి స్థాయికి చేరుకోలేడు. కొడాలి నాని చీకటి సామ్రాజ్యాన్ని నడిరోడ్డుపై నిలబెడతాం
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గన్నవరం లో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం లో పోటెత్తిన భక్తులు, ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు ఆ శివుని దర్శించుటకు క్యూ లైన్ లో వేచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్దలతో కార్తీక సోమవారాన్ని ఆచరిస్తున్నారు. మామిళ్ళపల్లి సాంబశివరావు ప్రధానా అర్చకులు.. శివ కేశవులు కు ఇష్టమైన ప్రీతికరమైన రోజులు కార్తిక మాసాలు రోజులు మొదలవుగానే స్నానాలు ఆచరించటం దేవతలు సైతం స్నానాలు ఆచరిస్తారని పురాణాలలో ఇతిహాసాలలో ఉన్నాయి. సూర్యోదయానికి పూర్వమే స్నానాలు ఆచరించాలని పురాణాల్లో ఉన్నాయి. శివునికి విశేషంగా కార్తీక మాసాలలో రుద్రాభిషేకాలు చేసి ఆ పరమశివుని దర్శకున్నట్లయితే కోటి జన్మల్లో ఉన్న పాపాలైన తొలగిపోతాయని నమ్మకం.. ఒక బిల్వహ పత్రాన్ని గనుక శివునికి సమర్పించినట్లయితే కోటి జన్మల లో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్తీకమాసం రోజుల్లో సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాక స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసి ఒక పూట భోజనం చేసినట్లయితే చాలా ఫలితము పుణ్య మోకాలు లభిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి. కృత్తికా నక్షత్రంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి అంటారు. ఆ పౌర్ణమి రోజున జ్వాలాతోరణం 365 ఒత్తులు వెలిగిస్తారు. ఎందుకంటే అందరికీ అన్ని రోజులు అనుగుణంగా ఉండదని ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం రావాలని కార్తీక మాసాల పుణ్య రోజుల్లో 365 ఒత్తులు వెలిగించి పుణ్యాన్ని పొందవచ్చు అని పురాణాత్మకంగా తెలియజేయబడింది. కాబట్టి ఈ కార్తీకమాసానికి అంతట విశిష్టత ఉంది. ఈ కార్యక్రమంలో ఆలయ రాజా పోషకులు కాసర్నేని బాబురావు, కాసర్నేని శ్రీనివాసు భక్తుల సందర్శనార్థం దేవాలయంలో అనేక ఏర్పాట్లు చేశారు.
Read Also..





Total views : 196553