Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra PradeshKrishana ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న రాజబాబు..

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న రాజబాబు..

by Rama
collector rajbabu

కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకిలో ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు ప్రాధాన్యత ర్యాలీలో కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతోపాటు ఆర్డీవో రాజు, తాడిగడప మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ రావు తో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు యొక్క ప్రాధాన్యతను గుర్తించాలని తద్వారా మంచి నాయకులను ఎన్నుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజబాబు కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్య పాత్ర పోషిస్తుందని అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాజబాబు అన్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: