Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh ఏపీలో త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు..

ఏపీలో త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు..

by CVR NEWS
ఏపీలో త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు

మంత్రి నారా లోకేష్ ఏపీకి ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు మంత్రి లోకేష్‌. త్వరలోనే ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. SIPB సమావేశంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి లోకేష్‌..ఏపీకి వస్తున్న పెట్టుబడులపై స్పందిస్తుంటారు. ఇందులో భాగంగానే గతేడాది రాష్ట్రానికి వచ్చే ఐటీ కంపెనీలు, పరిశ్రమలకు సంబంధించి వివరాలను ఎక్స్ వేదికగా అందరితో పంచుకున్నారు. ముందు సస్పెన్స్ అంటూ హింట్ ఇచ్చి..ఆ తర్వాత ఆ కంపెనీ పేరు, ఎంత పెట్టుబడి పెడుతుందో వివరాలతో సహా ట్వీట్ చేసేవారు. తాజాగా మరోసారి లోకేష్ ఏపీకి రాబోతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి ఓ వీడియోతో ట్వీట్ చేశారు. ఏపీకి ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలోనే రాబోతుందని చెప్పారు. రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏ లెజండరీ రైడ్.. ఆంధ్రప్రదేశ్‌లో రైడింగ్‌కు సిద్ధమవుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే..అమరావతిలో జరిగిన SIPB సమావేశంలో పలు ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ కంపెనీల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఉంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ 2 వేల 508 కోట్ల పెట్టుబడితో బుల్లెట్‌ మోటార్‌సైకిళ్ల తయారీ పరిశ్రమను తిరుపతిలో ఏర్పాటు చేయనుంది. ఇకపై రాయల్ ఎన్‌ఫీల్డ్ మేడిన్ ఆంధ్రప్రదేశ్ కాబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతిపాదనకు SIPB ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే రాయల్ ఎన్‌‌ఫీల్డ్ పెట్టుబడి గురించి ప్రస్తావిస్తూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: