Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.

by CVR NEWS
అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే ప్రమాదంలో పడ్డాయని, న్యాయపోరాటం ద్వారా వాటిని కాపాడుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సుమారు నూరు మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ రుణాలు మంజూరు చేసి, త్వరితగతిన గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థల పత్రాలు, నిర్మాణ పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: