Monday, July 20, 2026
News Navigation
Monday, July 20, 2026
News Navigation

Breaking

Monday, July 20, 2026
Home Andhra Pradesh కోనసీమ జిల్లాలో ప్రజలకు ఇబ్బందిగా మారిన వంతెన పనులు.

కోనసీమ జిల్లాలో ప్రజలకు ఇబ్బందిగా మారిన వంతెన పనులు.

by CVR NEWS
కోనసీమ జిల్లాలో ప్రజలకు ఇబ్బందిగా మారిన వంతెన పనులు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిండి-చించినాడ మధ్య వశిష్ఠ గోదావరిపై ఉన్న వంతెన మరమ్మత్తు పనులు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. గోదావరిపై ఉన్న వంతెనకు గత సుమారు పది నెలలుగా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి.మరో వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మరమ్మత్తు పనులు చేపట్టనున్న నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.అయితే నెలల తరబడి కొనసాగుతున్న మరమ్మత్తు పనుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ప్రతిరోజూ ట్రాఫిక్ అంతరాయాలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర అవసరాల కోసం ప్రయాణించే ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.మరమ్మత్తు పనులను వేగవంతంగా పూర్తి చేసి వంతెనను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041779
Total views : 219357

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: