Monday, July 20, 2026
News Navigation
Monday, July 20, 2026
News Navigation

Breaking

Monday, July 20, 2026
Home Latest News నిజామాబాద్ రూరల్ లో ఇందిరమ్మ ఇళ్లకు మరో ముందడుగు.

నిజామాబాద్ రూరల్ లో ఇందిరమ్మ ఇళ్లకు మరో ముందడుగు.

by CVR NEWS
నిజామాబాద్ రూరల్ లో ఇందిరమ్మ ఇళ్లకు మరో ముందడుగు

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు మరో ముందడుగు పడింది. రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి 299 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 95 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాలు–తండాలు అనే తేడా లేకుండా అర్హులందరికీ దశలవారీగా పక్కా ఇళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041779
Total views : 219357

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: